సిద్దిపేట నుంచి కేసీఆర్ పోటీ?

news02 Oct. 30, 2018, 7:47 a.m. political

kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టకుందా.. గజ్వేల్ నియోజకవర్గంలో గెలవలేనని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో రోజురోజుకు మారిపోతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో టీఆర్ ఎస్ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. అదే సమయంలో ప్రధఆన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఇక కాంగ్రెస్ కు ఇతర పార్టీలు తోడై మహాకూటమి ఏర్పడటంతో ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మాహాకూటమేన్న వాదన గట్టిగానే విన్పిస్తోంది. ఐతే అసలు విషయం ఏంటంటే.. తెలంగాణలో ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓటమి తప్పదని చాలా సర్వేల్లో వెల్లడైంది. తెలంగాణ సంగతి పక్కనపెడితే.. అసలు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈ సారి ఆయన గెలుస్తారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. 

kcr

మిగతా వారికి ఈ అనుమానం వస్తే ఏమో అనుకోవచ్చు గాని.. స్వయంగా కేసీఆర్ కే తన గెలుపుపై సందిగ్దం నెలకొందట. చాలా కాలంగా గజ్వేల్ లో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. అవన్నీ కేసీఆర్ కు.. టీఆర్ ఎస్ కు ప్రతికూలంగా మారాయట. 2014 ఎన్నికల్లోను కేసీఆర్ గజ్వేల్ నుంచి పెద్ద మెజార్టీతో ఏం గెలవలేదన్నది అందరికి తెలిసిన సంగతే. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై స్వల్ప మెజార్టీతో గెలిచారు కేసీఆర్. ఇక ఇప్పుడు పరిస్థితి మరింత జఠిలమైందని వేరే చెప్పక్కర్లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి.. సొంత నియోజకవర్గం గజ్వేల్ ను పెద్దగా అభివృద్ది చేసిందేమి లేదన్నది అక్కడి జనం అభిప్రాయం. పక్కన హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట్ తో పోల్సితే పది శాతం కూడా గజ్వేల్ అభివృద్ది కాలేదన్న వాదన గట్టిగానే విన్పిస్తోంది. 

kcr

అందుకే గజ్వేల్ ఓటర్లు ఈ సారి కేసీఆర్ వైపు లేరన్న అనుమానం స్వయంగా కేసీఆర్ నే పట్టిపీడిస్తోందట. అంతే కాదు నర్సారెడ్డి లాంటి టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు.. గజ్వేల్ కు చెందిన చాలా మంది టీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కంటే కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ప్రజలకు మరింత చేరువయ్యారు. అందుకే ఈ సారి గజ్వేల్ లో కేసీఆర్ గెలవడం అంత ఆషామాషి కాదని తెలుస్తోంది. దీంతో గజ్వేల్ లో పోటీ చేసి ఓడిపోయి పరువు తీసుకోవడం కంటే.. వేరే నియోకవర్గం చూసుకుంటే బావుంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. తన అల్లుడు హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటపై కేసీఆర్ కన్ను పడిందన్న చర్చ జరుగుతోంది. ఈ సారి సిద్దిపేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా దేవుడెరుగు.. కేసీఆర్ గెలవడమే కష్టమైపోయిందన్న పరిస్థితి వచ్చిందన్నమాట.

 

tags: kcr, cm kcr, trs, KCR is afraid of defeat, KCR contest from Siddipet, Empty TRAs in gajwel, voteru prathap reddy, prathap reddy will win in gajwel

Related Post