కేసీఆర్ కు ముందస్తు భయం..

news02 Sept. 5, 2018, 7:41 a.m. political

kcr

హైరదాబాద్ (పొలిటికల్ డెస్క్)- తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైంది. గురువారం ఉదయం మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయం 6.45 కు నిర్ణయించిన ముహూర్తానికి శాసనసభ రద్దును ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉన్నా ముందస్తుపై నిన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెగ ఉగిసలాడారని తెలుస్తోంది. మొన్న కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేధన సభ అట్టర్ ప్లాప్ అయినప్పటి నుంచి కేసీఆర్ ఆలోచనలో పడ్డారట. సుమారు 25లక్షల మంది జనం వస్తారని డంకా బజాయించాక.. తీరా వచ్చింది మూడు లక్షల మందే కావడంతో కేసీఆర్ బాగా నిరసపడిపోయారని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. 

kcr

ఇదిగో ఇటివంటి సమయంలో ముందస్తుకు వెళ్తే బొక్క బోర్లా పడతామేమో అన్న అనుమానం కేసీఆర్ ను పట్టిపీడిస్తోందట. అందుకే ఎప్పటిలాగే తనకు అలవాటైన ఫాంహౌజ్ కు వెళ్లి తెగ ఆలోచించారట కేసీఆర్. ప్రగతి నివేధన సభ ఫెయిల్ అయ్యింది కాబట్టి.. అనుకున్న జనం రాలేదు కాబట్టి ఇప్పుడే ముంస్తుకు వెళ్లడం అవసరమా అన్న కోణంలో ఆయన ఆలోచనలు సాగాయని తెలుస్తోంది. ముందుస్తును మరి కాస్త ముందుకు జరిపితే ఎలా ఉంటుందన్న కోణంలో సమాలోచనలు చేశరని తెలుస్తోంది.

kcr

ఐతే గత కొన్ని రోజులుగా ముందస్తుపై లీకులు ఇచ్చి ఉదరగొట్టారు కదా. సందర్బం వచ్చినప్పుడల్లా కేటీఆర్ నుంచి మొదలు మంత్రులంతా ముందస్తుపై మాట్లాడుతున్నారు. ఇక ప్రగతి నివేధన సభలోను సీఎం కేసీఆర్ ముందస్తుపై ఇండైరెక్ట్ గా మాట్లాడారు కూడా. మరి ఇలా ముందస్తుపై సర్వం సిద్దం చేసుకుని.. ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుందని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే జనంలో ఆధరన లేకపోయినా ముందస్తుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారని సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో ముందుస్తుకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇంతదాకా వచ్చి ముందస్తుకు వెళ్లకపోతే పరువు గంగలో కలుస్తుందన్న ఆవేధన ఒకవైపు.. ముందస్తుకు వెళ్తే ఓటమి ఖాయమన్న భయం మరోవైపు కేసీఆర్ ను పట్టిపీడిస్తున్నాయని పార్టీ వర్గాల సమాచారం.

tags: kcr, kcr pre poll, kcr about pre poll, kcr on pre poll, ts cabinet meet, ts cabinet meeting, kacr affraid of pre poll, kcr meetings, kcr thinking about pre poll

Related Post