ఓటమి భయంతోనే టీఆర్ ఎస్ 3మేనిఫెస్టోలు

news02 Dec. 3, 2018, 6:55 p.m. political

babu

ప్రజాకూటమిలో ప్రజల కోసం, తెంలగాణ కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే హైదరాబాద్‌ చుట్టూ 165 కిలోమీటర్ల పరిధిలో ఔటర్‌ రింగ్‌రోడ్డుకు శ్రీకారం చుట్టామని, మెట్రో రైలు‌ ప్రాజెక్టు తన కృషి వల్లే వచ్చిందని ఆయన చెప్పారు. ఒక ప్రత్యేకమైన విజన్‌తో హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశానని చెప్పిన చంద్రబాబు.. దేశంలో ఏ నగరానికీ హైదరాబాద్‌తో పోలిక లేదని అన్నారు. ఓటమి భయంతో టీఆర్ ఎస్ మూడు మేనిఫెస్టోలు విడుదల చేసిందని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదన్న చంద్రబాబు.. సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

babu

తానెప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదన్న ఆయన.. ఓ సీనియర్‌ నాయకుడిగా దేశంలోని పరిస్థితులను గాడిన పెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు 3వేల రూపాయల భృతి, అధికారంలోకి వచ్చిన మొదటి యోడాది లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్‌కు ఓట్లు లేవు కానీ డబ్బుల మూటలున్నాయని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్‌లో అన్ని స్థానాల్లో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు, ప్రలోభాలకు లోనుకాకుండా నిజాయతీగా ఓటేయాలని చంద్రబాబు ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలుగువారి మధ్య తాను చిచ్చు పెట్టడం లేదన్న చంద్రబాబు.. తెలుగువారి అభివృద్ధి కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పారు. 

tags: ap cm, chandra babu fire on kcr, chandra babu fire on trs, chandra babu fire on cm kcr, chandra babu ramnagar road show, chandra babu film nagar road show

Related Post