తెలంగాణ నేతలతో రాహూల్ భేటీ..

news02 Sept. 14, 2018, 4:34 p.m. political

rahul

తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారికే టిక్కెట్లు కెటాయిస్తామని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధి స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పీసిసి ఉపాధ్యక్షులు షబ్బీర్ ఆలి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు రాహూల్ తో సమావేశం అయ్యారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికలపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఈ సందర్బంగా రాహూల్ గాంధీ పీసిసి చీఫ్ ఉత్తమ్ కు సూచించారు. 

rahul gandhi

గెలిచే సీట్ల విషయంలో ఏమాత్రం రాజీపడొద్దన్న రాహూల్..  సాధ్యమైనంత వరకు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కెటాయించాలని చెప్పారు. ఇక పొత్తులు.. అభ్యర్ధుల ఎంపికకు సంబందించిన విషయాలేవి ఎవరూ భహిరంగంగా మాట్లాడొద్దని రాహూల్ స్పష్టం చేశారు. పార్టీకి సంబందించిన సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మరోవైపు తెలంగాణ వ్యవహారాలకు సంబందించి ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు రాహూల్ గాంధీ. భక్తచరణ్ దాస్ చైర్మెన్ గా జ్యోతీమణి సెంధిమలై, శర్మిష్ట ముఖర్జిలు సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీని నియమించారు.

 

tags: rahul , rahul gandhi meet tcong leaders, rahul gandhi meeting with telangana congress leaders, rahul meeting with ts congress leaders, rahul gandhi meting with uttam, rahul on ts elections

Related Post