హరీష్ రావు మంత్రి వర్గం లో అవసరమా..

news02 Jan. 13, 2019, 7:55 a.m. political

Harish Rao with kcr

 హైదరాబాద్: కొడుకు కేటీఆర్ ను పార్టీలో పవర్ సెంటర్ చేసేందుకు సీఎం కేసీఆర్ మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారు. టీఆర్ ఎస్ పార్టీలోని మిగతా పవర్ సెంటర్లను వీక్ చేయటంతో పాటు ..కేటీఆర్ ఒక్కరే లీడర్ గా ప్రొజెక్ట్ చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చకచకా జరిగిపోతున్నాయి. కేటీఆర్ కు ప్రధాన పోటీ దారుడైన హరీష్ రావును పోటీనుంచి తప్పించేందుకు కేసీఆర్ .. ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెలుతున్నట్లు కనిపిస్తోంది. 

Ktr working president

మొన్ననేతన కుమారుడు కేటీఆర్ కు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు మరి హరీష్ ఏంటి.. అనే చర్చ జరిగింది. హరీష్ రావు ను తొక్కేశారనే చర్చ రాజకీయ వర్గాలతో పాటు టీఆర్ ఎస్ లో జరిగింది. హరీష్ రావులో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయని అంచనా వేసిన.. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ లు హరీష్ రావుతో వ్యక్తిగతంగా మాట్లాడి చల్లబర్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు హరీష్ రావు చేసేదేమి లేదు కాబట్టి ఆయన కూడా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారని టీఆర్ ఎస్ లోని హరీష్ రావు వర్గం నేతలు చెబుతున్నారు. 

Ktr kcr Harish rao

ఇదంతాఒక ఎత్తేతే అసలు క్యాబినెట్ లో హరీష్ రావుకు చోటు దక్కుతుందా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎవరు ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. కాని పరిస్థితులు గమనిస్తుంటే హరీష్ రావు ఇక ఇంటికే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రకటించే క్యాబినెట్ లో హరీష్ రావుతో పాటు.. కేటీఆర్ కు కూడా అవకాశం ఉండదని తెలుస్తోంది. ఎలాగూ కేటీఆర్ కు కూడా మంత్రి వర్గంలో చోటు ఇవ్వరు కాబట్టి హరీష్ కు అన్యాయం జరిగిందనే అపవాదునుంచి బయటపడవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ కేటీఆర్ కు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భాధ్యతలున్నాయి కాబట్టి ... మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కేటీఆర్ చుట్టే తిరుగుతారు. కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకున్నా.. ఆయన ప్రాభవం ఏమి తగ్గదు. ఎటు వచ్చి హరీష్ రావు పవర్ సెంటర్ కాకూడదనే కేసీఆర్ వ్యూహం ఈ విదంగా అమలు కావొచ్చని ప్రగతి భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

tags: Cm kcr, kcr , Ktr, Mp Kavitha, Harish Rao, TRS Harish Rao, Harish Rao latest photos, TRS chief kcr latest address , Telangana cm home, Telangana next cm Ktr, Telangana TRS, Telangana political parties.

Related Post