గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామాను స‌మ‌ర్పించిన సిద్దు

news02 May 15, 2018, 5:12 p.m. political

siddu
బెంగ‌ళూరు: క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాకు అందించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ తో కాసేపు ముచ్చ‌టించారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు తెలిపారు. స‌ర్కారు ఏర్పాటుకు అవ‌కాశం ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సిద్ద‌రామ‌య్య విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు స‌మాచారం. అయితే సిద్దరామ‌య్య విజ్ఞ‌ప్తిపై గ‌వ‌ర్న‌ర్ ఎలాంటీ క్లారిటీ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. 
 

Related Post