టీఆర్ఎస్ కు ఓటేస్తే గులాం గిరీ చెయ్యాల్సిందే ..!

news02 March 12, 2019, 6:51 p.m. political

KISHAN REDDY

హైద‌రాబాద్ : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి . తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు మంగళవారం అమిత్ షాతో భేటీ అయ్యి ఎన్నిక‌ల వ్యూహాల‌పై చ‌ర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిష‌న్ రెడ్డి .. ఎన్నిఎంపీలు గెలిచినా టీఆర్‌ఎస్ కు లాభం లేదని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తేనే తెలంగాణకు మరింత ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

KISHAN REDDY

మోదీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఓటేయాలని కిషన్‌రెడ్డి పిలుపిచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కల్వకుంట్ల కుటుంబానికి గులాంగిరి చేయాల్సిందేనన్నారు. ఈ ఎన్నిక‌ల్లో కేసీఆర్ గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. రాష్ర్టాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన కేసీఆర్ ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. కాంగ్రెస్‌ పార్టీ .. టీఆర్‌ఎస్‌కు బీ టీమ్‌గా మారిందని విమర్శించారు. తన పోటీపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయమని కిషన్‌రెడ్డి స్సష్టం చేశారు.

KISHAN REDDY

tags: KISHAN REDDY,LAXMAN,CHINTALA RAMCHANDRA REDDY,NVS PRABHAKAR,RAMCHANDAR RAO,TELANGANA BJP,MODI,AMITH SHA,KCR,UTTAM KUMAR REDDY,REVANTH REDDYNJANAREDDY,RAHUL GANDHI,PRIYANKA GANDHI,SONIYA GANDHI,AICC, OFFICE,GANDHI BHAVAN,TELANGANA BJP OFFICE

Related Post