శుభ‌వార్త‌...?

news02 April 16, 2018, 4:17 p.m. political

హైద‌రాబాద్: ఆచార్య కోదండ‌రామ్ స్థాపించిన తెలంగాణ జ‌న స‌మితి ఆవిర్భావ స‌భ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మొద‌ట టీజేఎస్ స‌భ‌కు స‌ర్కారు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. దీంతో జ‌న స‌మితి నాయ‌కులు స‌భ నిర్వ‌హ‌ణ కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈమేర‌కు కోర్టు జ‌న స‌మితి విన‌తి ప‌రిశీలించి...మూడు రోజుల్లో స‌భ‌కు అనుమ‌తి మంజూరు చేయాల‌ని స‌ర్కారును ఆదేశించింది.  స‌రూర్ నగర్ గ్రౌండ్‌లో జరగనున్న సభకు ఎలాంటి అభ్యంత‌రాలు చెప్పొద్ద‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం ఆవిర్భావ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో.. టీజేఎస్ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

Related Post