బెజవాడలో ఫ్లెక్సీల కలకలం..

news02 Nov. 8, 2018, 9:23 a.m. political

tdp

విజయవాడలో ఫ్లెక్సీల రాజకీయం కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు పోటీగా జనసేన నాయకుడు మండలి రాజేష్ ఫ్లెక్సీలు కట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరును విమర్శిస్తూ కాట్రగడ్డ బాబు గత నెల రోజులుగా విజయవాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒకటి లేదా రెండు అసెంబ్లీ సీట్లు గెలిస్తే మహా ఎక్కువని ఫ్లెక్సీలో కామెంట్ చేశారు. అంతే కాదు గత 2009 ఎన్నికల్లో అన్నా దమ్ములు కలిసి పోటీ చేస్తే వచ్చింది 18 సీట్లే కదా అని ఎద్దేవా కూడా చేశారు. 

tdp

పవన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలని ఫ్లెక్సీలో హితువు పలికారు. అంతే కాదు ఎరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. మళ్లీ కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబే అని చెప్పుకొచ్చారు. టీడీపీ ఫ్లెక్సీకి  ప్రతిగా ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావటం కలకలం రేపుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ పరిస్థితి ఏమిటి.. 2014లో అధికారంలోని కారణం ఏమిటో తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలంటూ ఫ్లెక్సీలో రాశారు. ఇలా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తుండటంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. రెండు పార్టీల నేతల్ని పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

tags: tdp, tdp flexi, tdp flexi in vijayawada, tdp contravercy flexi ij vijayawada

Related Post