17న ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు సిద్ధ‌మైన యెడ్డీ

news02 May 16, 2018, 4:57 p.m. political

yeddy 1

బెంగ‌ళూరు: క‌ర్నాట‌క రాజ‌కీయ అనిశ్చితికి తెర దించేందుకు బీజేపీ సిద్ధ‌మైంది. బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష నాయ‌కుడిగా ఎన్నికైన యెడ్డియుర‌ప్పాతో ప్ర‌మాణ‌స్వీకారం చేయించేందుకు ఆపార్టీ ఏర్పాట్లు చేస్తోంది. రేపు 12.20 నిమిషాలకు కంఠీర్వ స్టేడియంలో యెడ్డీ ప్ర‌మాణ స్వీకారం చేసేలా రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆపార్టీ పూర్తి చేస్తుంది. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ డుమ్మా కొట్ట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఇప్ప‌టికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంద‌రికీ బిజెపి అధిష్టానం స‌మాచారం పంపింది.  ప్ర‌మాణ స్వీకార‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.  ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి బీజేపీ అగ్ర నాయ‌కులు కూడా వ‌స్తున్న‌ట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. 

yeddy 2

ఎన్నిక‌ల‌కు ముందే యెడ్డీయుర‌ప్పా ఈనెల 17న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి హంగ్ ఏర్ప‌డిన నేప‌థ్యంలో కూడా యెడ్డీ మ‌రోసారి అదే విష‌యాన్ని పున‌రుద్ఘాటించారు. అందులో భాగంగానే అత్య‌ధిక స్థానాలు సాధించిన పార్టీగా యెడ్డీ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ముందు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి.. త‌ర్వాత శాస‌న స‌భ‌లో బ‌లం నిరూపించుకోవ‌చ్చ‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఎమ్మెల్యేల‌కు విశ్వాసం క‌ల్గించ‌డంతో పాటు.. బ‌ల నిరూప‌న‌కు మార్గం సుగ‌మం అవుతుంద‌ని బీజేపీ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌-జేడీఎస్‌ల నుంచి కూడా అభ్య‌ర్థులు త‌మ వైపు వ‌చ్చే చాన్స్ ఉంటుంద‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. పెద్ద పార్టీగా బీజీపీ అవ‌త‌రించినందున గ‌వ‌ర్న‌ర్ స‌ర్కారు ఏర్పాటుకు ఆహ్వానించ‌డం ఇక లాంఛ‌న‌మేన‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. మొత్తంగా రేప‌టితో క‌ర్నాట‌క రాజ‌కీయ అనిశ్చితిపై ఓక్లారిటీ రానుంది.

tags: yeddipramanaswikaram,yeddiyurappaa,bjp,congress,jds,karnataka elections

Related Post