నామినేషన్లకు ముందే రెండుగా చీలుతున్న టిఆర్ఎస్

news02 Sept. 25, 2018, 9:28 a.m. political

Harish Rao shock to cm kcr

 

హైద‌రాబాద్ః టీఆర్ ఎస్ లో ముస‌లం మొద‌లైంది. త‌న కొడుకు కేటీఆర్ ను సీఎం చేసేందుకు అడ్డు ఉన్న వారిని త‌ప్పించేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌టం పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. మాస్ లీడ‌ర్ గా పేరు తెచ్చుకున్న హ‌రీష్ రావును అడ్డు త‌ప్పించేందుకు కేసీఆర్ వేసిన స్కెచ్ బెడిసికొట్టి ర‌చ్చ ర‌చ్చ అవుతోంది. హ‌రీష్ రావు ఇలాంటి విష‌యాలు త‌న అనుచ‌రుల‌కు చెప్ప‌క‌నే చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలోనే ఇబ్ర‌హీంప‌ట్నం గ్రామంలో త‌ను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని హ‌రీష్ రావు.. చెప్ప‌టం వెన‌క ఉన్న మ‌త‌ల‌బు కూడా అదే అన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

త‌న‌ను క‌ట్ట‌డి చేస్తున్నార‌నే భావించిన హ‌రీష్ రావు మెల్ల‌మెల్ల‌గా త‌ను కూడా పావులు క‌దుపుతున్నారు. రోజులో ఒక్క సారైనా మామ కేసీఆర్ ను క‌లిసే హరీష్ రావు ఇటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు గాని .. అటు ఫా హౌజ్ కు గాని వెళ్ళ‌టం లేదు. క‌నీసం కేసీఆర్ ను క‌ల‌వ‌క ప‌దిహేను రోజులు అవుతుంద‌ని స‌మాచారం. కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్ ను హైలెట్ చేసేందుకు .. హ‌రీష్ రావును రాష్ట్రంలో ఎక్క‌డ తిర‌గ‌కుండా కేవ‌లం సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం చేశారు. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న హరీష్ రావు ప్రస్తుతం ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా రాజ‌కీయాలను కూడా ప‌ట్టించుకోవ‌టం లేదు. సిద్దిపేట నియొజ‌క‌వ‌ర్గంలో ఊరూరు తిరిగి త‌న ప‌ని తాను చేసుకుంటున్నారు.

Cm kcr family

హ‌రీష్ రావుకు మొద‌టి నుంచి టీఆర్ ఎస్ లో ఒక వ‌ర్గం ఉంది. కేటీఆర్ వ్య‌వ‌హారం న‌చ్చని వాళ్ళు...కేటీఆర్ పొగ‌రును ద‌గ్గ‌ర‌నుంచి చూసిన వాళ్ళు అనుకోకుండా హ‌రీష్ రావును అభిమానులుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ‌రుగుతున్న ప‌రినామాల‌తో వాళ్లంతా హ‌రీష్ రావును బాస‌ట‌గా నిలుస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌రీష్ రావును మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్థుల్లో దాదాపు 45 మంది హ‌రీష్ రావు వ‌ర్గం నేత‌లే. వాళ్లంతా ర‌హ‌స్యంగా హ‌రీష్ రావుతో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది.

కేటీఆర్ ను సీఎం చేస్తే త‌న క్యాబినెట్ ప‌ని చేసేందుకు త‌న‌కు ఎలాంటి అభ్యంతరం లేద‌ని హ‌రీష్ రావును బ‌ల‌వంతంగా ఒక చాన‌ల్ కు పంపి మ‌రీ చెప్పించుకున్నారు. మ‌న‌స్సు చంపుకొని త‌ను ఇలా చెప్పిన‌ట్లు ఆయ‌న వ‌ర్గం నేత‌లు కొంద‌రు చెబుతున్నారు. త‌ను సై అంటే హ‌రీష్ రావు వెంట క‌దిలేందుకు టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు చాలా మంది సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రికి అనుమానాలు రాకుండా హ‌రీష్ రావుతో బ‌ల‌వంతంగా కేసీఆర్ స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నార‌ని టీఆర్ ఎస్ లో చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో నామినేష‌న్ లు వేసే క‌న్నా ముందే టీఆర్ ఎస్ రెండుగా చీలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కేసీఆర్ బ్ర‌తికి ఉన్న‌న్ని రోజులు హ‌రీష్ రావు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోర‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ప‌రిస్థితులు అందుకు బిన్నంగా క‌నిపిస్తున్నాయి. కేటీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. హ‌రీష్ రావు వ‌ల్ల ఎదురయ్యే ప్ర‌మాదం అంచ‌నా వేసుకునే ఆయ‌న్ను ప‌క్క‌కు పెడుతున్నార‌ని స్పష్టంగా క‌నిపిస్తోంది.

మొద‌లేఅంతంతంగా ఉన్న పార్టీ, ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేఖ‌త‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీఆర్ ఎస్ కు ఇంట‌ర్నల్ వ్య‌వ‌హారం మ‌రింత బ‌ల‌హీనప‌రుస్తోంది. హ‌రీష్ రావు కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే గ‌నుక జ‌రిగితే టీఆర్ ఎస్ ఉనికి కూడా లేకుండా పోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అబిప్రాయ‌ప‌డుతున్నారు.

tags: Cm kcr, kcr , Ktr, Mp Kavitha, Harish Rao, TRS Harish Rao, Harish Rao latest photos, TRS chief kcr latest address , Telangana cm home, Telangana next cm Ktr, Telangana TRS, Telangana political parties.

Related Post