సరికొత్త రాజకీయ సమీకరణ..

news02 Nov. 1, 2018, 7:25 p.m. political

rahul

దేశ రాజధాని ఢిళ్లీ సరికొత్త రాజకీయ సమీకరణానికి వేధికైంది. అరుదైన వ్యక్తుల కలయికతో హస్తిన మురిసిపోయింది. నలభై యేళ్ల రాజకీయ చతురతతో ఒకరు.. దశాబ్ధాల మూస రాజకీయాలకు కొత్త హంగులు దిద్దాలన్న పట్టుదలతో మరొకరు.. దేశంలోని వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిస్తున్న మోదీ మార్క్ పాలనకు చరమగీతం పాడేందుకు ఇద్దరు ఒక్కటయ్యారు. అవును ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. వీరిద్దరు మోదీ నిరంకుశ పరిపాలను అంతమొందించేందుకు నడుం బిగించారు. గత నాలుగున్నరేళ్లుగా మోదీ తీసున్న అనుచిత నిర్ణయాలతో దేశం అభివృద్ది కుంటుపడిపోయింది. ఈ నేపధ్యంలో మళ్లీ మోదీని అధికారంలోకి రానివ్వద్దని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో చంద్రబాబు జత కట్టారు. 

babu

దేశానికి కాబోయే ప్రధాని రాహూల్ గాంధీనే అన్న నినాదం గట్టిగా విన్పిస్తున్న ఈ సమయంలో మోదీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. అందుకనే చాలా దశాబ్ధాల విభేదాలను పక్కన పెట్టి రాహూల్ గాందీ, చంద్రబాబు లు ఏకమయ్యారు. దేశ అభివృద్ది కోసం ఇకపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. రాహూల్, చంద్రబాబు కలయికపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ , టీడీపీ సమ్మిళితం చారిత్రాత్మకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలను సైతం కులుపుకుని.. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి.. ప్రజలను మోదీ నిరంకుశ పాలన నుంచి కాపాడుకోవాలన్న వాదన గట్టిగా విన్పిస్తోంది. మొత్తానికి రాహూల్ గాంధీ, చంద్రబాబు నాయుడు స్నేహం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

rahul chandra babu

రాబోవు రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ మిత్రత్వం దేశ రాజకీయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేయబోతోందనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిశానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి కూడా రాహుల్‌ మద్దతిచ్చారని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని చెప్పారు. రఫేల్‌ పోరాటాన్నిరాహుల్‌ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని ప్రశంసించారు చంద్రబాబు. 

tags: rahul, chandra babu, rahul meet chandra babu, chandra babu meet rahul gandhi, chandra babu met rahul gandhi, rahul gandhi met chandra babu, rahul chandra babu meeting, chandra babu rahul gandhi meeting

Related Post