నిరుద్యోగ భృతి ఏమయ్యింది?

news02 June 4, 2019, 3:32 p.m. political

uttam

 

ఎన్నికల సందర్బంగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మునగాల మండల కేంద్ర శివారులోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయాన్ని దర్శించిన ఉత్తమ్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈమేరకు ఆలయ పూజారులు ఉత్తమ్ కు ఘన స్వాగతం పలికారు. డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పేదవాని సొంతింటి కళ నెరవేరలేదని చెప్పారు. చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతిని ఇస్తానని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్.. ఇప్పటీకీ ఆ ఉసే ఎత్తడం లేదని మండిపడ్డారు. ఉత్తమ్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసర్ల కోటేశ్వరరావు, కొప్పుల జైపాల్‌రెడ్డి, అమరగాని మట్టయ్య, భీంపంగు శంకర్‌, దేవినేని రవి తదితరులు ఉన్నారు.
 

tags: uttam, uttam perfome puja at munagala ayyapap temple, pcc chief uttam visit munagala ayyappa temple, uttam about double bedroom scheam, uttam fire on mc kcr

Related Post