అధికారంలోకి రాగానే 2లక్షల రుణమాఫీ

news02 April 9, 2019, 10:58 p.m. political

congress

నల్గొండ లోక్‌సభ నుంచి పీసీసీ చీఫ్.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం ఖాయమని ఆపార్టీ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీకి కొంతమంది పోలీసులు తొత్తుగా మారారని ఆయన ఆరోపించారు. నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నర్సింహా రెడ్డి మాట్లాడారు. పోలీసులు నిస్పక్షపాతంగా.. స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి, టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించటం సరికాదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు చేయడాన్ని నర్సింహా రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఓటర్లను టీఆర్ ఎస్ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని సోదాలు చేస్తూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. నల్గొండ లోక్ సభ స్తానం నుంచి దేశ సైనికుడికి, భూకబ్జాదారుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ నాయకుడు మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు.   

tags: congress, t congress, telangana congress, congress leaders, congress leaders election campaign in nalgonda, nalgonda election campaign, pcc chief uttam election campaign in nalgonda

Related Post