ప్ర‌చండ భానుడు..!

news02 April 17, 2018, 1:14 p.m. political

విజ‌య‌వాడ: రాష్ట్రంలో భానుడు విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్ర‌త‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాబోయే ఐదు రోజుల్లో ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ హెచ్చ‌రిస్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉష్ణోగ్ర‌త‌లు అధిక సంఖ్య‌లో పెర‌గ‌నున్న‌ట్లు తెలిపింది.  అధిక ఉష్ణోగ్ర‌తతో  వేడి పెరిగే అవ‌కాశం ఉన్నందున బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తోంది. 

బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు జ్యూస్‌, ఓఆర్ ఎస్ ప్యాకెట్ల‌ను తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఫ‌లితంగా బాడీ డీ-జ‌న‌రేష‌న్‌కు గురి కాద‌ని చెబుతున్నారు. 

tags: sunrising,midday,ap,disastarmanagement

Related Post