కోదండారాం పోటీచేసేందుకు నియోజ‌క‌వ‌ర్గం రెడీ

news02 April 5, 2018, 7:54 p.m. political

kodandaram party jenda

హైద‌రాబాద్ః జేఏసీ నుంచి రాజ‌కీయరంగం లోకి అడుగుపెట్టిన ప్రొ.కోదండారాం ఎక్క‌డి నుంచి పోటీ చేయ‌బోతున్నారు..  ఏప‌ద‌వికి పోటీ చేయ‌బోతున్నారు. ఇలాంటి అన్ని అంశాల‌కు క్లారిటీ మెల్ల‌మెల్ల‌గా క్లారిటీ వ‌స్తోంది. తెలంగాణ జ‌న స‌మితి పార్టీని స్థాపించిన కోదండారాం ఇప్ప‌టికే పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. ఈనెల 29 న భారీ భ‌హిరంగ‌స‌భ‌తో పార్టీని జ‌నాల్లోకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేశారు కోదండారాం..

అయితే కోదండారం ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో కాలు పెట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల‌ని కోదండారాం సూచ‌నాప్రాయంగా అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఒక వేళ కాంగ్రెస్ తో పాటు ఇత‌ర పార్టీల‌తో పొత్తుపెట్టుకున్నా మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈజీగా టికెట్ సాధించ‌వ‌చ్చ‌నే తెలంగాణ జేఏసీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

కోదండారాం పుట్టింది కూడా మంచిర్యాల‌నే కావ‌టంతో అక్క‌డ‌నుంచే పోటీ చేసేందుకు కోదండారాం మ‌క్కువ చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. జేఏసీ ఇప్ప‌టికీ బ‌లంగా ఉండ‌టం.. సింగ‌రేణి కార్మికుల‌తో కోదండారాం కు మంచి సంబందాలుండ‌టం.. ఈమ‌ధ్య‌నే టీఆర్ ఎస్ కు చెందిన ఒక స్థానిక నేత జేఏసీ లో చేర‌టంతో అక్క‌డ బ‌లం పెరిగింద‌ని భావిస్తున్నారు. అదే సంద‌ర్బంలో ప్ర‌స్తుత టీఆర్ ఎస్ ఎమ్మెల్యే దివాక‌ర్ రావు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జ‌నాల్లో న‌మ్మ‌కం కోల్పోయార‌ని చ‌ర్చ ఉంది. దీంతో కోదండారాం మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశాలున్నాయి.  

tags: jac chairman, kodandaram, telangana jana samithi, cm kcr, manchiryala, mla diwakar rao, peddapalli, congress.

Related Post