తెలంగాణలో భారీగా తగ్గిన పోలింగ్ శాతం

news02 April 11, 2019, 8:40 p.m. political

medaka_loksabha_election_persenge.jpg

హైదరాబాద్ ;  అసెంబ్లీ ఎన్నికల పలితాలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల పర్సెంటేజీ బాగా పడిపోయింది. తెలంగాణాలో మొత్తం 17 పార్లమెంట్ లలో 68.60 శాతంతో మెదక్ మొదటి స్థానంలో నిలవగా .. ఉద్యోగస్తులు , విద్యాధికులు ఎక్కువగా ఉండే సికింద్రాబాద్  39.20 శాతంతో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది . ఇక 39. 49 శాతంతో సికింద్రాబాద్ కంటే కాస్త ముందు భాగంలో హైదరాబాద్ నిలిచింది . మరి ముఖ్యనంగా సిటీలో పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్ మరింత దారుణంగా కనిపించింది.ఇదిలా ఉంటే టాప్ పొజిషన్‌లో మాత్రం మెదక్‌లో మాత్రం 68.60 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో భువనగిరి 68.25 శాతంతో రెండో స్థానంలో ఉంది.  ఈ పడిపోయిన పోలింగ్ పర్సెంటేజీ ఏపార్టీ పుట్టిముంచుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదిలావుంటే పోలింగ్ పూర్తి అయిన తర్వాత 17 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటించిన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. 

hyderabad_polling_persentege.jpg

మెదక్ 68.60 
భువనగిరి 68.25 
కరీంనగర్ 68 
ఖమ్మం 67.96 
జహీరాబాద్ 67. 80
ఆదిలాబాద్ 66.76 
పెద్దపల్లి 59.24 
నిజామాబాద్ 54.20
మల్కాజ్‌గిరి 42.75 
సికింద్రాబాద్ 39.20 
హైదరాబాద్ 39. 49 
చేవెళ్ల 53.80 
మహబూబ్‌నగర్ 64.99 
నాగర్ కర్నూల్ 57. 12 
నల్గొండ్ 66.11 
వరంగల్ 60 
మహబూబాబాద్ 59.90

tags: telengana mp elections, poor persentege, loksabha elections, trs, congress, bjp, first medak, last secundrabad, election commission, ts,

Related Post