హైద‌రాబాద్‌కు జేడీఎస్ ఎమ్మెల్యేల బ‌స్సు

news02 May 17, 2018, 11:39 a.m. political

jds hyd
బెంగ‌ళూరు: క‌ర్నాక‌ట రాజకీయాల్లో హైడ్రామా కొన‌సాగుతునే ఉంది. ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టికీ..కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ బిజెపికి లేనందున స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతుంది. యెడ్డీ త‌న బ‌లాన్ని నిరూపించుకునేందుకు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్‌ వాలా 15 రోజుల పాటు అవ‌కాశాన్ని ఇచ్చారు.  ఈనేప‌థ్యంలో జేడీఎస్‌-కాంగ్రెస్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. బీజేపీ ఎక్క‌డ త‌మ ఎమ్మెల్యేల‌ను గ‌ద్ద‌ల త‌న్నుకు పోతుందోన‌ని శాస‌న స‌భ్యుల‌ను కాపాడుకునే ప‌నిలో ప‌డ్డాయి. ఇందులో భాగంగానే త‌మ ఎమ్మెల్యేల‌ను క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులు దాటించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. 

jds 2

ప్ర‌స్తుతం కాంగ్రెస్‌-జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగ‌ళూరులోనే వేర్వేరు ప్రాంతాల్లో మ‌కాం వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈగిల్టన్‌ రిసార్ట్‌లో ఉండగా, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు షాంగ్రిలా హోటల్‌లో ఉన్నారు. అయితే వీరంద‌రూ అక్క‌డ ఉండ‌డం క్షేమం కాద‌ని భావించిన రెండు పార్టీల‌ అధినాయ‌క‌త్వం ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డే ఉంటే ఐటీ దాడులు చేసి ఎమ్మెల్యేల‌ను విడిపించి బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం ఉన్నందున ముందు జాగ్ర‌త్త‌గా బ‌స్సుల్లో ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్ త‌ర‌లించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. 

jds 3

అంతేకాకుండా ముఖ్య‌మంత్రి కేసీఆర్ జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉండేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ క‌ర్నాక‌ట‌ ఎన్నిక‌లకు ముందు జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ప్ర‌స్తుతం కేసీఆర్ జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. 

tags: jds,congress,bjphyderabad,bengallor

Related Post