సెక్స్‌వ‌ల్ హర‌స్‌మెంట్ చేశాడ‌ని ఆరోప‌ణ‌

news02 July 6, 2018, 12:35 p.m. political

suman

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న ప‌లువురు మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధించాడ‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీకి  పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్‌, న్యాయవాదులు వీఎస్‌రావు, ఎంఎస్‌రెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు వారు పీఎంకు ఓలేఖ‌ను రాశారు. బాల్క‌సుమ‌న్ బాధ్య‌త‌యుత‌మైన ఎంపీ ప‌ద‌విలో కొన‌సాగుతూ...కొంద‌రిని సెక్స్‌వ‌ల్ హ‌ర‌స్‌మెంట్ చేస్తున్నాడ‌ని ఈలేఖ‌లో ఆరోపించారు. అంతేకాక మ‌ళ్లీ బాధితుల‌పైనే త‌ప్పుడు కేసులు న‌మోదు చేయిస్తూ...ఇబ్బంది పెడుతున్న‌ట్లు పేర్కొన్నారు. అలా సుమ‌న్ చేతిలో మోస‌పోయి కేసులు న‌మోదైన బాధితులు సంధ్య, విజేత‌ల‌తో పాటు మ‌రికొంత మంది మ‌హిళ‌లు, శంక‌ర్‌, గోపాల్ అనే వ్య‌క్తులు ఉన్నార‌ని...వారికి న్యాయ‌చేయాల‌ని కోరారు. 

suman

అయితే ఈఏడాది మే 31వ తేదీన ఇద్దరు మహిళలు, ఇద్దరు అబ్బాయిలు వచ్చి దౌర్జన్యం చేశారని, తనను బెదిరించారని ఎంపీ పీఏ మర్రి సునీల్ జూన్ 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 31న సాయంత్రం బంజారాహిల్స్‌ నందినగర్‌లో ఎంపీ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు ఆన‌లుగురు వ‌చ్చారు. వారు వ‌చ్చి రావ‌డంతోనే న‌న్ను నెట్టేసి...బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. బాల్క సుమన్‌ కోసం ఇల్లంతా వెతికారు. లోపల ఆయన లేకపోవడంతో..త‌న‌ను, ఎంపీని అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. సుమ‌న్ మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించారు. దౌర్జన్యం చేసిన వారిలో సంధ్య, విజేత, శంకర్‌, గోపాల్‌లున్నారంటూ...సునీల్ ఈమేర‌కు పోలీసుల‌కు కంప్టైంట్ చేశారు. దీంతో సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనలుగురిపై పోలీసులు...హౌజ్ ట్రెస్‌పాస్ ఐపీసీ-448, దూషించినందుకు ఐపీసీ-506 సెక్ష‌న్ల కింద కొద్దిరోజుల క్రిత‌మే కేసులు బుక్ చేశారు. 

suman

అయితే ఈవ్య‌వ‌హ‌రం ప్ర‌స్తుతం మ‌రింత ముద‌ర‌డం విశేషం. ఈఘ‌ట‌న‌లో కేసులు న‌మోదైంది బాధితుల‌పైనేన‌ని ...ఎంపీదే పూర్తి త‌ప్ప‌ని పాత్రికేయులు, న్యాయ‌వాదులు ప్ర‌ధానికి లేఖ రాయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇందులో స‌ద‌రు మ‌హిళ‌ల‌కు త‌గిన న్యాయం జ‌రిగేలా చూడాల‌ని...మ‌హిళ క‌మిష‌న్‌, రాజ‌కీయ పార్టీలు చొర‌వ తీసుకోవాల‌ని...కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సార్వ‌త్రిక ఎన్నిక‌లు కొద్ది నెల‌ల్లోనే ఉన్నందునా...ఎంపీ సుమ‌న్‌పై వ‌చ్చిన ఈఆరోప‌ణ‌లు పొలిటిక‌ల్‌గా ఎలాంటీ మ‌లుపులు తిరుగుతోందో చూడాలి మ‌రి.
 

tags: mp suman,mp suman,mp suman wife,mp sumanthiran,mp suman peddapalli,suman mp3,mp balka suman,mp balka suman wife photos,mp balka suman caste,mp balka suman wife,mp balka suman address,mp balka suman family photos,m a sumanthiran mp,f a sumon mp3 song mp balka suman phone number,mp balka suman contact number,mp balka suman biography,trs mp balka suman caste,mp balka suman cast,mp balka suman cell number,balka suman mp contact details,suman choudhary mp,mp balka suman details,suman dj mp3 mp balka suman family,mp balka suman fight,suman gurjar mp police,suman.hit.songs.mp3,mp balka suman images,mp balka suman wife images,suman kalyanpur mp3,mp balka suman marriage photos,suman movies mp3,balka suman mp peddapalli,peddapalli mp suman,mp balka suman photos,mp balka suman profile,prem suman,suman re mp3,suman mp3 songs,suman mp telangana,trs mp suman mp balka suman wiki,prem suman mp3 song,fa sumon mp3 song,fa sumon mp3

Related Post