కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ

news02 April 9, 2019, 11:03 p.m. political

uttam

కాంగ్సేస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఉత్తమ్ మాట్లాడారు. మట్టపల్లి ఆలయంలో లక్ష్మీనృసింహునికి పూజలు నిర్వహించి తన ప్రచార కార్యక్రమాలను ఉత్తమ్‌ ప్రారంభించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఛైర్మన్‌ చెన్నూరు విజయ్‌కుమార్‌ స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. క్షేత్రంలో ప్రచార వాహనంపై నుంచి ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకూ కాంగ్రెస్‌ పాలనలోనే సమన్యాయం జరిగిందని ఈ సందర్బంగా ఉత్తమ్ తెలిపారు.

uttam

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2లక్షల వరకూ ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కనీస ఆదాయ పథకం కింద ప్రతి పేద కుటుంబానికీ యేడాదికి 72వేలు అందజేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. తాను ఉమ్మడి ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ మంత్రిగా ఉన్నపుడు అన్ని సామాజిక వర్గాల వారికి ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే కేంద్ర నిధులతో పేదలకు గృహాలు కట్టిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పత్తి, మిరప పంటలకు గిట్టుబాటు ధర కోసం లోక్‌సభలో రైతుల వాణి వినిపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో కొన్ని వర్గాల వారికే సంక్షేమ ఫలాలు అందాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలకు ఓటేయడంవల్ల ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేదని చెప్పారు. 

 

tags: uttam, pcc chief uttam, uttam kuamar reddy, nalgonda election campaign, matampally uttam election campaign, uttam election campaign in matam pally, uttam kumar reddy nalgonda election campaign

Related Post