టీఆర్ ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి

news02 Dec. 4, 2018, 9:38 p.m. political

rahul

అరెస్టులతో కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని టీఆర్‌ఎస్‌ అడ్డుకోలేదని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్‌రెడ్డి అరెస్టని ఆయన ట్వీట్ చేశారు‌. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రాహూల్ గాంధీ మండిపడ్డారు. ఓటమి భయం వల్లే కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఐతే రాహుల్ గాంధీ తన ట్వీట్‌ను తెలుగులో చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

tags: rahul, rahul gandhi, rahul about revanth arrest, rahul gandhi about revanth arrest, rahul on revanth arrest, rahul tweet on revanth arrest

Related Post