ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితే కాంగ్రెస్ కు లాభం

news02 July 3, 2018, 7:17 a.m. political

Cm kcr u turn on early elections

హైద‌రాబాద్ః సీఎం కేసీఆర్ మ‌రో మారు యూ ట‌ర్న్ తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన చాలా హామీల‌పై, తీసుకున్న నిర్ణ‌యాల‌పై యూ టర్న్ తీసుకుంటే ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై బ్యాక్ స్టెప్ వేశారు. నవంబ‌ర్ లేదా... డిసెంబ‌ర్ లో ఎన్నిక‌లు వెళ్దామా.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా అని కాంగ్రెస్ కు స‌వాల్ విసిరిన కేసీఆర్.. హ‌స్తం పార్టీ నేత‌లు స‌వాల్ ను స్వీక‌రించాక ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకు వెళ్ళాల అని చ‌ర్చిస్తున్నారు.

Cm kcr u turn on early elections

ప్ర‌ధాని మోడీ ముంద‌స్తుకు వెళ్ళినా.. వెళ్ళ‌క పోయినా ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్ళాల‌ని డిసైడ్ అయ్యారు. దానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌తి ప‌క్షాల‌ను రెచ్చ‌గొట్ట‌డం.. పార్టీ నేత‌ల‌ను పుర‌మాయించ‌టం లాంటివి చేశారు. అయితే ఢిల్లీనుంచి వ‌స్తున్న సంకేతాల‌తో కేసీఆర్ చ‌ల్ల‌బ‌డ్డారు. మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళితేనే.. అసెంబ్లీ ఎన్నిల‌కు వెళ్ళాలి.. లేదంటే షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సిద్దం కావాల‌ని సీఎం కేసీఆర్ కొఇంత మంది పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Utham Kumar Reddy saval cm kcr

సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌వాల్ విస‌ర‌టం.. వెంట‌నే ఊహించ‌నివిదంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ఆ స‌వాల్ ను స్వీక‌రించ‌టంతో టీఆర్ఎస్ నేతలు డైలామాలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అన‌వ‌స‌రంగా త‌మ అధినేత ప్ర‌తి ప‌క్షాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని పార్టీలోని మిగ‌తా నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. సంస్థాగతంగా బ‌లంగా ఉన్న కాంగ్రెస్.. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిందంటే శ్రేణులన్ని ఆటోమెటిక్ గా యాక్టివ్ అవుతాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఉత్త‌మ్ సై అన‌టంతో నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అప్పుడే రంగంలోకి దిగిన‌ట్లు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హైక‌మాండ్ కు స‌మాచారం ఇచ్చారు. బ‌హుషా కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌నుంచి యూ ట‌ర్న్ తీసుకోవడానికి ఒక కార‌ణంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Utham Kumar Reddy

లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి వెళ్ళాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అవి ముంద‌స్తు అయినా.. లేదంటే షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగినా .. అసెంబ్లీకి ఒక‌సారి, లోక్ స‌భ‌కు ఒక‌సారి ఎన్నిక‌ల‌కు వెళితే అది టీఆర్ ఎస్ కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. వేరువేరుగా జ‌రిగితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్థానిక అంశాలు.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జాతీయ అంశాలు, జాతీయ‌పార్టీలు ప్ర‌భావం చూపిస్తాయి. లోక్ స‌భ ఎన్నిక‌లు స‌ప‌రేట్ గా జ‌రిగితే అవి కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ గా ఉంటాయి త‌ప్ప టీఆర్ ఎస్ సీన్ లో కూడా ఉండ‌ద‌ని గులాబీ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. దీంతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళే  అంశంపై దూకుడు త‌గ్గించాల‌ని టీఆర్ ఎస్ నేత‌ల‌కు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేసిన‌ట్లు స‌మాచారం.

tags: early elections, jamili elections, pm modi on jamili elections, cm kcr saval, cm kcr on early elections, utham kumar reddy on mundasthu elections, pcc chief utham twitter, utham twitter, utham kumar reddy photos, utham kumar reddy family, utham kumar reddy whatsup number, songs on cm kcr, congress songs, songress office adderess, gandhi bavan images, gandhibavan wicky, congress history, trs politics, trs president.

Related Post