12 శాతం రిజర్వేషన్ పై కేసీఆర్ పిల్లిమొగ్గలు

news02 June 17, 2018, 11:46 a.m. political

Cm KCR met pm Narendra Modi

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం కాలం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్ పెట్టిన మేనిఫెస్టోలో కూడా మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ పై హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ రిజర్వేషన్ పై పిల్లిమొగ్గలు వేస్తున్నారన్న చర్చ జరుగుతుంది.

Cm KCR ifthar party

ఇప్పటికే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. పార్లమెంటులో రిజర్వేషన్ ఆమోదిస్తే తప్ప అది అమలులోకి రాదు. కానీ ఇప్పటివరకు అసెంబ్లీ నుంచి పంపిన బిల్లును బిజెపి నేతలు టచ్ చేయలేదు. రాష్ట్ర విభజనతో పాటు ఇతర హామీలపై ప్రధాని మోడీ పై టీఆర్ఎస్ నేతలు 12 శాతం రిజర్వేషన్ పై ఎలాంటి ఒత్తిడి పెంచలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్ అన్ని అంశాలను ప్రస్తావించారు.. కానీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లుపై నోరు విప్పలేదు.. అడగలేదు.

Cm KCR meet pm modi

ఇప్పటికే 12 శాతం రిజర్వేషన్ ను ఎన్నికల స్టంట్ గా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి అయితే ముస్లింలకు ఇచ్చిన హామీని కె.సి.ఆర్ ఎందుకు పట్టించుకోవటం లేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు . రంజాన్ పర్వదినాన మోడీతో భేటీ అయిన కేసీఆర్ మైనార్టీల రిజర్వేషన్ పై కచ్చితంగా మాట్లాడుతారని అందరూ ఆశించారు. కానీ మోడీతో ఇతర డిమాండ్లను వినిపించిన కెసిఆర్ రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు అయితే రిజర్వేషన్ పై నోరు మెదపటం లేదు. తాజాగా ఇఫ్తార్ విందు లో పాల్గొన్న సీఎం కేసీఆర్ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించకుం డానే ప్రసంగాన్ని ముగించారు. సరిగ్గా 2014 రంజాన్ పండుగకు షాద్ నగర్ జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం కెసిఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అప్పట్నుంచి నాలుగు రంజాన్ పండుగలు అయిపోయాయి. అయినా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఫలాలు అందలేదు. ఈ ప్రశ్నలకు గులాబీ పార్టీ నేతలు ఏమి సమాధానం చెపుతారో చూడాలి.

tags: Cm KCR ifthar party, minarty reservation, cm KCR met pm modi, cm KCR promises, cm KCR Delhi tour, cm KCR about muslim reservations, pm modi on reservations, muslim reservation updates, Telangana assembly, Telangana assembly muslim reservation bill overall, trs 2014 manifesto, trs manifesto 2019.

Related Post