అవును ..ఎంపీ, ఎమ్మెల్యే తన్నుకున్నారు

news02 March 7, 2019, 8:58 a.m. political

mp_mla_fighting_in_utthar_pradhesh_bjp

లక్నో :ఎంపీ ,ఎమ్మెల్యే ..తన్నుకున్నారు .. అది అట్టా ఇట్టా కాదు  చెప్పులతో కొట్టుకున్నారు.  పోని వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారనుకుంటే పొరపాటే... వారి ఇద్దరిది ఓకే పార్టీ అదికూడా అధికార పార్టీ ..అందులోను క్రమశిక్షణ కు మేమే చిరునామా అని చెప్పే బీజేపీ కి చెందిన ప్రజాప్రతినిధులు.  అవును నిజం. వివరాల్లోకి వెలితే ..ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టుకున్నారు . ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిలాఫలకం పై తన పేరు ఎందుకు రాయలేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠి సమావేశంలో నిలదీశాడు . అంతటితో ఆగకుండా తన పేరు లేకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు త్రిపాఠి. అక్కడితో ఆగకుండా ఏకంగా ఎమ్మెల్యేని ఎంపీ చెప్పుతో కొట్టాడు. తొటి ప్రజాప్రతినిధి అనే విషయం కూడా ఆలోచించకుండా ఎంపీ ఎమ్మెల్యేని చెడామడా చెప్పుతో వాయించేశాడు. దీనితో ఆ ఎమ్మెల్యే కూడా తన సీటు నుంచి లేచి ఎంపీపై దాడికి దిగాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో సమావేశం కాస్తా రచ్చ రచ్చ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరు బీజేపీ ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా మేము మాత్రం ఏం తక్కువ అనుకున్నారో ఏమో ..వారు ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. వీళ్లంతా అధికార పార్టీవాళ్ళు కావడంతో ..వారిని బుజ్జగించి కూల్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు.

tags: utthar pradhesh bjp, mp shard thripati,mla rakesh singh, up police, fighting, shoes fighint,bjp, governament programme

Related Post