మా తమ్మున్ని చిత్తుచిత్తుగా ఓడించండి

news02 June 3, 2018, 7:47 p.m. political

Dk aruna chitram ramamohan reddy

మహబూబ్ నగర్ : రాజకీయాలు వేరు రక్త సంబంధం వేరంటున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, సోదరుడు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన రామ్మోహన్ రెడ్డి తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో అక్కా తమ్ముళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. కుటుంబ కార్యక్రమాల్లో సైతం రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో  ఆత్మకూర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని, వ్యక్తులు ముఖ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. తన కుమార్తె వచ్చే ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేయడం లేదని వివరణ ఇచ్చారు డీకే అరుణ.

Dk aruna tie the rakhi to mla ram mohan reddy

tags: Mla ramMohan reddy, dk aruna, dk bharath simha feddy, sama rasina reddy, dk aruna family, dk aruna bother , dk aruna daughter, dk arun sister, dk aruna songs, dk aruna birthday.

Related Post