ఎన్నికల సంఘం-పోలీసుల పక్షపాతం

news02 Dec. 4, 2018, 2:56 p.m. political

uttam

రేవంత్ రెడ్డి అరెస్ట్‌ అప్రజాస్వామికమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అర్థరాత్రి రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌ చేశారని, టీఆర్‌ఎస్‌ అరాచక పాలనకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. ఒక దుర్మార్గమైన పద్దతిలో రేవంత్ ను అరెస్ట్ చేయడాన్ని ఉత్తమ్ తీవన్రస్థాయిలో ఆక్షేపించారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు పీసిసి చీఫ్. కొడంగల్ లో సీఎ ంకేసీార్ భహిరంగ సభ ఉందని.. ఆ సభ విఫలమవుతుందన్న భయంతోనే ఇలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఎన్నికల సంఘం, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన, స్వేఛ్చాయుత పోలింగ్ జరిగేలా చాడాలని.. లేదంటే ప్రజలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

tags: uttam, uttam on revanth, uttam on revanth arrest, pcc chief uttam on revanth arrest, uttam kumar reddy about revanth arrest, uttam fire on revanth reddy arrest

Related Post