తెలంగాణ లో కేసీఆర్‌ ను తరిమికొట్టడం ఖాయం

news02 April 17, 2018, 8:17 p.m. political

utham kumar reddy badrachalam tour

కొత్త‌గూడెం ః  రాష్ట్రంలో టీఆరెఎస్ ప్రభుత్వం అవలంభిస్తున విధానాలను ప్రజలు గ్రహిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్ హెచ్చ‌రించారు. సంప‌త్ , కోమ‌టిరెడ్డిల విష‌యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన‌న తీర్పు ప్రభుత్వ పెద్దలకు  చెంపపెట్టుగా అభివర్ణించారు. మంగళవారం నాడు భద్రాచలం కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన ఆయన సభను ఉదేశించి మాట్లాడారు. ఆయనతో పాటు కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, శాసనమండలి విపక్ష నేత షబీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. 

utham bus tour

రాష్ట్ర శాసనసభలో స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని, కావున స్పీకర్, సీఎం కేసీఆర్ కు కొనసాగే నైతిక హక్కు లేదని ఉత్త‌మ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి సింగరేణి కార్మికులు మద్దతు పలకటం వల్లే అధికారం వచ్చిందని కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వారిని పూర్తిగా విస్మరించారని అన్నారు.  15 వేల మంది సింగరేణి కార్మికులను పర్మినెంటు చేస్తామని చెపిన ముఖ్యమంత్రి వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా సింగరేణిలో సస్పెండ్ అయిన ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇస్తామని, ఆస్తి పన్ను మినహియింపు ఇస్తామని చూపిన కేసీఆర్ సింగరేణి కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆస్తిపన్ను మినహాయింపు విషయంలో న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

utham bus tour

అటవీ హక్కుల చట్టం విషయంలో గిరిజనులు, ఆదివాసీలకు న్యాయం చేయాలని ఇప్పటికే రాహుల్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాహుల్ నాయకత్వం లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు పాటించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతులకు ఏకాకాలంలో రూ.2లక్షల రూపాయలు రుణమాఫీ చేయడంతో పాటు పత్తి, వరి పంటలకు గిట్టుబాటు ధరను పెంచి ఇస్తామన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి రూ. 3వేలు ఇవడం జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానమును వెంటనే రద్దు చేయాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాగానే కేంద్ర కేబినెట్ లోకి బలరాం నాయక్ కు చోటు దక్కుతుందని, అలాగే వచ్చే ఎన్నికల్లో రేగ కాంతారావుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి  న్యాయం చేస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని పోలీసులను పెట్టి శాసనసభ నుంచి కేసీఆర్ గెంటించారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆరెస్ పార్టీ వారినీ పూర్తిగా విస్మరించడం జరిగిందని అన్నారు. నేడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో  ఏ వర్గం వారు కూడా సంతృప్తిగా లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వంకు కాంగ్రెసును గెలిపించి టీఆరెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Related Post