ఇప్ప‌టీకే మోదీ వైరి వ‌ర్గంతో గ్రూప్ క‌డుతున్న రాహుల్‌

news02 June 16, 2018, 5:26 p.m. political

modiki rahul skech

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ప‌క్కా స్కెచ్ వేశారంటా...! కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్లుతున్నారంటా...! అందుకోసం బీజేపీ వ్య‌తిరేక భావ‌సారూప్య‌త క‌ల్గిన పార్టీల‌న్నీంటినీ..ఒకే గొడుగు కింద‌కు తీసుకువ‌స్తున్నారంటా...! అందులో భాగంగానే 2019కి సంబంధించిన రోడ్ మ్యాప్‌ను కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సిద్ధం కూడా చేశారంటా..!

bjp,congress

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేందుకు రాహుల్ కొత్త ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించిన‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారం, అర్ధ బ‌ల‌మున్న బీజేపీని ఎదుర్కోవ‌డంలో కాంగ్రెస్‌...ఇప్ప‌టి వ‌ర‌కూ అనుస‌రించిన విధానాన్నే రాహుల్ ఫాలో కావాల‌ని భావిస్తున్న‌రంటా...! అందు కోసం బీజేపీని వ్య‌తిరేకిస్తున్న పార్టీల‌ను క‌లుపుకొని ముందుకు వెళ్లాల‌ని  భావిస్తున్నారంటా...! ఇందు కోసం అవ‌స‌ర‌మైతే మ‌హ‌కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని భావిస్తున్నారంటా...! అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్‌తో క‌లిసి వ‌చ్చే మిత్ర ప‌క్షాల‌కు సీట్ల స‌ర్దుబాటు కూడా చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

congress and oppositions

అందుకోసం అవ‌స‌ర‌మైతే మిత్ర ప‌క్షాల‌కు ఎక్కువ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ 250 సీట్ల‌లోనే పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో రాహుల్ ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఎక్కువ సీట్లు మిత్ర‌ప‌క్షాల‌కు ఇవ్వ‌డం ద్వారా కాంగ్రెస్ త‌ను పోటీ చేసే స్థానాల్లో...దాని మిత్ర ప‌క్షాల స‌పోర్ట్‌తో ఓటింగ్ ప‌ర్సెంటేజిని అనూహ్యంగా పెంచ‌వ‌వ‌చ్చ‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్య‌ప్ర‌దేవ్‌, మ‌హారాష్ట్ర, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ల‌తో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న క‌ర్నాట‌క‌, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అత్య‌ధిక ఎంపీ సీట్ల‌ను కైవ‌సం చేసుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. 

rahul,modi

దీనికి రాహుల్ ప‌లు కార‌ణాలు కూడా ఉద‌హ‌రిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌నే ఆయ‌న పార్టీ సీనియ‌ర్ నేత‌ల ముందు పెట్టిన‌ట్లు హ‌స్తం నేత‌లంటున్నారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క, మ‌హారాష్ట్ర, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్, విప‌క్షాలు ఒక్క‌టై బీజేపీని చావు దెబ్బ‌కొట్టిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇక ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో ఐతే 2014లో బీజేపీ 73 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్ప‌టీకీ...త‌ర్వాత జ‌రిగిన గోర‌గ్‌పూర్‌,కైరానాలో ఆపార్టీ ఓడిపోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని అంటున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే క‌ర్నాట‌క‌లో బీజేపీ బూత్ స్థాయిలో విప‌రీతంగా డ‌బ్బులు పంచిన కార‌ణంగానే ఆపార్టీకి అన్ని సీట్లు వ‌చ్చిన‌ట్లు రాహుల్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు క‌నుక కాంగ్రెస్‌-జేడీఎస్ క‌లిసి పోటీ చేస్తే బీజేపీ అడ్ర‌స్ గ‌ల్లంతైదని భావ‌న‌లో ఉన్న‌ట్లు అంటున్నారు. 

ak antony

అందుక‌నే కాంగ్రెస్, విప‌క్షాలు క‌లిసి పోటీ చేసేందుకు అవ‌స‌ర‌మైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు మాజీ ర‌క్ష‌ణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలో  రాహుల్ గాంధీ క‌మిటీని ఏర్పాటు చేసి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈకమిటీ జిల్లా, రాష్ట్ర క‌మిటీల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కోంటున్న స‌మ‌స్య‌లు, స‌వాళ్ల‌పై హైక‌మాండ్‌కు ఓనివేదిక ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. ఆంటోని క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే త‌ర్వాత కార్య‌చ‌ర‌ణ ఉండొచ్చ‌ని చెబుతున్నారు. నివేదిక మేర‌కే రాహుల్ ఏ స్థానాల్లో ఏవ‌రెవ‌రూ పోటీ చెయ‌వ‌చ్చ‌నే దానిపై ఓక్లారిటీ రావ‌చ్చ‌ని అంటున్నారు.

rahul gandhi smile

tags: Congress,general elcetions,Mahagathbandhan,2019 elections,bjp,rahul master skech,up,bihar,rajasthan,maharastra,rahul gandhi sketch,rahul gandhi cartoon sketch,rahul gandhi pencil sketch,rajiv gandhi pencil sketch,rahul gandhi,rahul gandhi age,rahul gandhi twitter,rahul gandhi wife,rahul gandhi news,rahul gandhi marriage,rahul gandhi funny,rahul gandhi speech,rahul gandhi date of birth,rahul gandhi engagement,rahul gandhi wife name,rahul gandhi education rahul gandhi aditi singh,rahul gandhi address,rahul gandhi assets,rahul gandhi and modi,rahul gandhi and narendra modi, rahul gandhi and sonia gandhi,rahul gandhi astrology,rahul gandhi amethi,rahul gandhi aikido,rahul a gandhi,rahul gandhi a pappu,rahul gandhi a team,rahul gandhi a idiot,rahul gandhi biography,rahul gandhi birthday,rahul gandhi bhashan,rahul gandhi birth place,rahul gandhi birth date,rahul gandhi birth chart,rahul gandhi basavanna,rahul gandhi biography in hindi rahul gandhi bangalore,rahul gandhi best speech,rahul gan

Related Post