వీవీప్యాట్ లను లెక్కించాలి

news02 Feb. 5, 2019, 8:01 a.m. political

parties

దేశంలో సామాన్యులు సహా రాజకీయ వర్గాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయని బీజేపీయేతర రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషన్ ను కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. మొత్తం 23 రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిసి ఈమేరకు తమ అనుమానాలను వ్యక్తం చేయడంతో పాటు.. అభ్యంతరాలను తెలిపాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఈవీఎంలలో నమోదైన ఓట్లతో పాటు, వీవీ ప్యాట్ లలోని స్లిప్పులను కనీసం 50 శాతం లెక్కించేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఇలా వీవీ ప్యాట్ లలోని స్లిప్పులను లెక్కించినప్పుడు గెలుపు-ఓటముల మధ్య ఓట్ల తేడా 5శాతం లోపు ఉంటే మొత్తం అన్ని వీవీప్యాట్‌లను లెక్కించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఇక ఈవీఎంలలోని ఓట్లకు, వీవీప్యాట్‌ లలోని ఓట్లకు మధ్య తేడా ఉంటే వీవీప్యాట్‌ ఓట్లనే అంతిమంగా పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రల నేతృత్వంలో మొత్తం 23 రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా వినతిపత్రం సమర్పించారు. 
 

tags: evm, evms, vvpats, opposition partys meet ec, opposition parties mee election commission, opposition parties demand vvpat countiong

Related Post