అమ‌రావ‌తిలో ఏడుకొండ‌ల వాడు..

news02 Jan. 31, 2019, 10:56 p.m. political

lord_balaji_temple_ay_amaravathi

విజ‌య‌వాడ‌- ఏపీ రాజధాని అమరావతి త్వరలో మరో తిరుమలగా మారనుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు రెడీ అయిపోయింది. దీనికి గాను గురువారం సీఎం చంద్రబాబు ఆనంద నిల‌యానికి  శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం బాబు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి ప్రాంతంలో నాగలితో దున్ని నవధాన్యాలు చల్లారు. టీటీడీ నుంచి వచ్చిన వేదపండింతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తిరుమల పెద్ద జీయంగార్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వం  రూ.150 కోట్లతో ఆల‌య నిర్మాణం చేయ‌నున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన టెంపుల్ నిర్మాణానికి చంద్ర‌బాబు భూమి పూజ చేస్తారు.అమ‌రావ‌తిలోని వెంకటపాలెం దగ్గర ప్ర‌భుత్వం కేటాయించిన  25 ఎకరాలలో ..5 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తారు. మిగిలిన 20 ఎకరాల్లో కళ్యాణ మండపాలు, ఆలయ నిర్వహణకు, భక్తులకు అవసరమైన ఏర్పట్లకు తగిన నిర్మాణాలు, పార్కులు నిర్మిస్తారు. ఈ టెంపుల్‌ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్‌ కూడా ఓకే అయ్యాయి.సో .. అమ‌రావ‌తి మ‌రో తిరుమ‌ల‌గా.. ప్ర‌సిద్దికెక్క‌బోతుంద‌న్నమాట‌. 

ananda_nilayam_at_amaravath

tags: amaravathi, cm ap, chandrababu naidu, inagural anandanilayam, lord balaji, venkateswara temple, venkataya palem, ttd

Related Post