తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న రాహూల్ దేశవ్యాప్తంగా పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణతో పాటు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు తెలంగాణతో పాటు మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని రాహూల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇక బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఒంటరిగా పోటీ చేయడం కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపించదని రాహుల్ గాంధీ అన్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని మాయావతి చేసిన వ్యాఖ్యలపై రాహూల్ స్పందించారు. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పొత్తు అంశం మాపై పెద్దగా ప్రభావాన్ని చూపదని రాహూల్ స్పష్టం చేశారు. ఐతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశముందని రాహూల్ గాంధీ చెప్పారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో ఆ అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దేశంలో బీజేపీని, తెలంగాణలో టీఆర్ ఎస్ లాంటి పార్టీలను ఓడించాలంటే కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని రాహూల్ గాంధి స్పష్టం చేశారు.