పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్ తో టిఆర్ఏఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు

news02 Aug. 10, 2018, 4:46 p.m. political

Trs mlasహైదరాబాద్ : తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై అధికార టీఆర్ఎస్ ఎలాంటి అంచనాతో ఉంది .. 2019 ఎన్నికలపై కేసీఆర్ సర్వేలు ఏం చెబుతున్నాయి .. మళ్లీ మనదే అధికారం అంటున్న గులాబీ బాస్ మాటలపై స్వంత పార్టీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు .. హస్తం పార్టీ పై గులాబీ సేనలో జరుగుతున్న చర్చ అత్యంత ఆసక్తి రేపుతోంది . ఇంతకీ ఏమిటా చర్చ .. టీఆర్ఎస్ లోని అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం .. సీఎం కేసీఆర్ చెబుతున్న సర్వేలను గులాబీ ఎమ్మెల్యేలు విశ్వసించడం లేదట . అధినేత కేసీఆర్ చెబుతున్న దానికి ఫీల్డ్ లో వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉందంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు .

Trs

గ్రౌండ్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందనే అభిప్రాయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తుండం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం అమలౌతున్న సర్కార్ పథకాలు ఏవీకూడా మనల్ని అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం మెజారిటీ ఎమ్మెల్యేల్లో ఉండటం ఆ పార్టీలో హీట్ రాజేస్తోంది. అయితే ఈ విషయాలను నేరుగా ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం లేక ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసినా ఆఫ్ ద రికార్డ్ ఇదే ముచ్చట్లు ఒకరికొకరు చెవులు గోరుక్కుకున్తున్నారు.

Trs

నియోజకవర్గాల్లో పరిస్థితులు .. ఓవరాల్ రాష్ట్ర స్థాయిలో పరిస్థితులపై ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటున్నారు. తమ అధినేత నిర్వహిస్తున్న సర్వేల్లోనే కాంగ్రెస్ పరిస్థితి మంచి మెరుగ్గా ఉందని వస్తుందని .. బయటికి చెప్పేమాటల్లాగా టిఆర్ఎస్ పరిస్థితి అంత మెరుగ్గాలేదని .. దీన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచించకుండా తమ అధినేత మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పోతే పుట్టి మునగక తప్పదంటున్నారు.

Trs

ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రకటిస్తున్న పథకాలు జనంలో బాగా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాయని .. మనం ఇస్తున్న రైతుబందు లాంటి స్కీం లు బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయనే ఆవేదన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో బలంగా ఉంది.ఇదే విషయాన్ని వారి అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు . మనం బ్రాంతి నుంచి బయటపడి .. వాస్తవికతతో వ్యవహరించకపోతే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని చెబుతున్నారు .

tags: TRS,TRS bhavan,kcr,ktr,Harish Rao,Santhosh Kumar,Telangana bhavan,TRS MLAs,Telangana assembly,Telangana cm,Uttam Kumar Reddy ,Kamareddy,revanth Reddy,Shabbir Ali,Bhatti Vikramarka,Congress,Gandhi bhavan ,kcr sarvy,Telangana elections,TRS govt,Congress Govt,Uttam bus yathra,Rahul gandhi

Related Post