కొండగట్టు బాధితుల ఆందోళన

news02 Oct. 8, 2018, 1:48 p.m. political

కేసీఆర్

కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మొత్తం 60 మంది చనిపోయిన విషాద ఘటన ఇంకా మన కళ్లముందు కదులుతూనే ఉంది. ఆర్టీసీ, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అమాయకులైన 60 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చాలా మంది నిరుపేదలు తమ వారిని కోల్పోయి దిక్కూ మొక్కు లేని వారిగా రోడ్డు మీద పడ్డారు. ఐతే 60 మంది చనిపోయినా కనీసం వారి కుటుంబాలను పరామర్శించేందుకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇక చనిపోయిన వారి కుటంబాలకు ప్రభుత్వం ఎంతో కొంత పరిహారం ఇవ్వాలని కాబట్టి తూ తూ మంత్రంగా ప్రకటించారు. పోనీ ఎంతో కొంత పరిహారం ప్రభుత్వం నుంచి వచ్చింది కదా అని సంతోషపడ్డ ప్రమాద బాధిత కుటుంబాలకు షాక్ తగిలింది.

కేసీఆర్

ప్రభుత్వం ఇచ్చిన పరిహార చెక్కులను తీసుకుని బ్యాంకులకు వెళ్తే అవి ఉట్టి చెక్కులే.. ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేవని బ్యాంకు అధికారులు చెప్పడంతో బాధితులు అవాక్కయ్యారు. దీంతో చెక్కులిచ్చిన ఆర్డీఓ దగ్గరకు వెళ్లి విషయం చెప్పగా.. డబ్బులు లేవు.. ఏమీ లేవు ముందు బయటకు నడవండని గేటు బయటకు గెంటేశారు. బాధితులను తీవ్రంగా అవమానించి పంపించేశారు. అక్కడకు వచ్చిన పోలీసులు సైతం మీ గొంతెమ్మ కోరిుకలు తీర్చేందుకు ఆర్డీఓ కు ఖాళీ లేదు వెళ్లండని తరిమేశారట. దీంతో దిత్తుతోచని స్థితిలో పడ్డారు కొండగట్టు ప్రమాద బాధిత కుటుంబాలు. కేసీఆర్ కు కనీసం తమను పరామర్శించే తీరికా.. మనసు లేకపోయినా.. తమను ఆదుకుంటారని ఆశపడితే.. తమకు నిరాశే ఎదురయ్యిందని బావురుమంటున్నారు.

tags: కేసీఆర్, కొండగట్టు ప్రమాదం, kondagattu victims, kondagattu victims fire on kcr, kondagattu victims shocked, kondagattu victims agitation, kondagattu victims fire on trs govt

Related Post