గజ్వేల్ లో కేసీఆర్ కు షాక్..

news02 Oct. 3, 2018, 8:24 p.m. political

uttam

కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా టీఆర్ ఎస్ పార్టీలోంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఇన్నాళ్లు నమ్మి మోస పోయిన వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వీరంతా కోరుకుంటున్నారు. ఇక పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నాగేశ్వర రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. నాగేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఉత్తమ్. అటు గజ్వేల్ నియోజకవర్గం లో టీఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. 

uttam

కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని జగదేవపూర్ ఎంపీపీ రేణుకతో పాటు.. ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు సర్పంచ్ లు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పీసిసి చీఫ్. ఈ సందర్బంగా మాట్డాడిన ఉత్తమ్.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒక్క కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తోంటే గజ్వేల్ లో ప్రతాప్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అటు దుబ్బాకలో రామలింగారెడ్డి ఓటమి ఖాయమని ఉత్తమ్ తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ రోజునా ఫీజురియంబర్స్‌మెంట్‌ ఆపలేదన్న ఉత్తమ్‌.. అన్ని వర్గాలనూ కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు. 

uttam

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో బాగుపడింది కేసీర్‌ కుటుంబంలోని నలుగురేనని విమర్శించారు. తెలంగాణ సమాజంలో దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళల్ని ముఖ్యమంత్రి మోసం చేశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందని చెప్పిన ఉత్తమ్.. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే టీఆర్ ఎస్ డబ్బులు, మధ్యం పంచుతుందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుయుక్తులను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరుగుతున్నాయని ఉత్తమ్ చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని పరామార్శించని కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. కేసీఆర్ స్వంత నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున చేరికలే టీఆర్ ఎస్ ఓటమికి నాంది పలుకుతున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
 

tags: uttam, pcc uttam , uttam fire on kcr, uttam fire on cm kcr, trs leaders joined in congress, congress joiningsm gajwel trs leaders joined in congress

Related Post