మోదీ చేతకానివాడు

news02 Feb. 8, 2019, 8:05 a.m. political

rahul

ఏఐసీసీ అధ్యక్షులు రాహూల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. మోదీని పిరికిపందగా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రత, రఫేల్‌ యుద్ధ విమానాల వ్యవహారంపై తనతో చర్చకు రావాలని రాహూల్ సవాల్ విసిరారు. డిల్లీలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం సదస్సులో  రాహూల్ పాల్గొన్నారు. అయిదేళ్ల పోరాటం తరువాత మోదీ తత్వమేమిటో అర్థమయిందన్న రాహూల్.. చివరకు ఆయన పిరికిపంద అని తేలిందని చెప్పారు. నేను వెనక్కి తగ్గనని గట్టిగా చెప్పేవారంటే మోదీకి భయమన్న రాహూల్.. అలాంటి వారిని చూసి ఆయనే వెనక్కి తగ్గుతారని అన్నారు. ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోందని.. విద్వేషాలు పెంచేవారికి ఓటమి తప్పదని రాహూల్ హెచ్చరించారు. 
రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, నాగ్‌పుర్‌ నుంచి పాలన కొనసాగించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశయమని రాహుల్‌ ఆరోపించారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ తన మనుషులను న్యాయవ్యవస్థతో పాటు, ఎన్నికల సంఘంలో దూరుస్తోందని రాహూల్ ఆరోపించారు. ప్రధాని మోదీపై దర్యాప్తు చేయాలని సీబీఐ చీఫ్ అనుకుంటే ఆయన్ని పక్కన పెట్టేస్తారని అన్నాారు. దేశంలో ప్రధానమైన అన్ని వ్యవస్థలను నాశనం చేయాలన్నదే వారి టార్గెట్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ ఫేస్ మాత్రమేన్నన రాహుల్.. అసలు సర్కార్ ను నడిపిస్తోంది ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవతే అని రాహూల్ గాంధీ వ్యాఖ్యానించారు.

tags: rahul, rahul gandhi, rahul fire on modi, rahul gandhi fire on modi, rahul fire on pm modi, rahul gandhi fire on pm modi

Related Post