తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు

news02 April 12, 2019, 5:29 p.m. political

uttam

దేశ వ్యాప్తంగా జరిగిన మోదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో మంచి స్పందన లభించిందని పీసిసి చీఫ్.. నల్గొండ లోక్ సభ అభ్యర్ధి ఉత్తమ్ కమార్ రెడ్డి అన్నారు. కోదాడలో తన సతీమణి పద్మావతితో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి వేవ్ కనిపించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో మెజార్జీ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామని ఆన ధీమా వ్యక్తం చేశారు. అటు దేశ వ్యాప్తంగా 91 లోక్ సభ స్థానాలకు జరిగిన మొదటి దశ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే గెలవనున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని.. కాబోయే ప్రధాని రాహూల్ గాంధీనే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

tags: uttam, pcc chief uttam, uttam cast vote, pcc chief uttam cast vote, uttam kumar reddy cast uttam, uttam about loka sabha polling

Related Post