ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరుబాట

news02 May 1, 2019, 10:14 a.m. political

BHATTI VIKRAMARKA

ఖమ్మం : తెలంగాణ సీఎం‌పై నిప్పులు చెరిగారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తూ.. రాజకీయ తీవ్రవాదిగా మారారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో ప్రతిపక్షమే లేకుండా కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సీఎం కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు భట్టి విక్రమార్క. ఆయన చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ బస్సు యాత్ర.. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చేరుకుంది. కేసీఆర్‌ వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని… ఓ రాజకీయ తీవ్రవాది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ములతో ఇతర పార్టీల MLA లను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటుందనడానికి ఇంటర్‌ ఫలితాలే నిదర్శనమన్నారు.

BHATTI VIKRAMARKA

అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్షమే లేకుండా కుట్ర పన్నుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి పెళ్లి ఒక చోట.. సంసారం మరోచోట అన్న చందంగా ఉందని ఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా 420లేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. ఓట్లు వేసిన ప్రజలను కేసీఆర్‌కు అమ్మేసి వారు కారు ఎక్కరని మండిపడ్డారు. ఇటువంటి మోసగాళ్లకు చట్టసభల్లో అవకాశం ఇవ్వకూడదని మండిపడ్డారు.

BHATTI VIKRAMARKA 

పరిరక్షణకు ప్రజలంతా కదలిరావాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాలని గవర్నర్‌, శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పార్టీలు ఫిరాయించిన ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి తిరిగి ప్రజాక్షేత్రంలో గెలవాలని ఆయన సవాల్‌ విసిరారు భట్టి విక్రమార్క.

BHATTI VIKRAMARKA

tags: MALLU BHATTI VIKRAMARKA,CLP LEADER, CONGRES,PRAJA SWAMYA PARIRAKSHANA YATRA,KCR,KTR,HAISHRAO,KAVITHA,TRS, CONGRES,UTTAM KUMAR REDDY, REVANTH REDDY, GANDHIBHAVAN,TRS BHAVAN,MLAS DIFFECTIONS, SPEAKER, ASSEMBLY, NARENDRA MODI, TELANGANA CM,TPCC,AICC, RAHUL GANDHI

Related Post