టీఆర్ఎస్ పాల‌న‌లో దారుణాలు ..!

news02 Dec. 25, 2018, 11:01 p.m. political

vijayashanthi


హైద‌రాబాద్ : కాంగ్రెస్ నేత విజయశాంతి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో పరిస్థితి యథారాజా...తథా ప్రజా అన్న చందంగా ఉందని ఆమె విమ‌ర్శించారు. కేసీఆర్ అరాచకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్ లో చేర్చుకొని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దౌర్జన్యాన్ని ఆదర్శంగా తీసుకుని కొందరు దుండగులు ప్రైవేట్ ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. 

vijayashanthi

ఆసుప‌త్రిపై దాడిని అడ్డుకోబోయిన పోలీసులపైనా దుండ‌గులు దాడి చేయడం అమానుషం అన్నారు విజ‌య‌శాంతి . తెలంగాణ ప్రజలు ప్రతి విషయాన్నిగమనిస్తున్నారన్న ఆమె .. టీఆర్‌ఎస్‌ పాలనలో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని జనం వణికిపోతున్నారన్నారు.  ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.

vijayashanthi

tags: Vijayashanthi Hot Comments On KCR Govt,kcr,congress mlcs,trs mlcs,congress,trs,kcr,ktr,kavitha,harishrao,ex mp vijayashanthi,ramulamma

Related Post