ప్రశ్నించే గొంతుక ఉండకూడదనే విలీనం

news02 June 10, 2019, 7:44 p.m. political

uttam

సీఎల్పీని..  టీఆర్ ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేయడంపై తాము చేపట్టిన పోరాటం ఇంతటితో ఆగదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తేల్చి చెప్పారు ఆమరణ నిరాహార. దీక్షా శిబిరంపై దాడి చేసి మల్లు భట్టి విక్రమార్కను అరెస్ట్‌ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీఆర్ ఎస్ పార్టీకి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుక ఉండకూడదనే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వీడు టీఆర్ ఎస్ పార్టీలోకి మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాము చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను విలీనం చేయడమేంటని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. 

uttam
అధిస్టానం పెద్దలతో పాటు తామంతా విజ్ఞప్తి చేయడంతో భట్టి విక్రమార్క దీక్ష విరమించారని పీసీసీ చీఫ్ తెలిపారు. సీఎల్పీని టీఆర్ ఎస్ లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైకోర్టులో వచ్చే తీర్పు ఆధారంగా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఎంఐఎంకు ప్రతిపక్ష హోధా ఎలా ఇస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. సీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలో విలీన వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ ఎస్ ఖూనీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. 

tags: uttam, pcc chief uttam, uttam about clp merge, pcc chief uttam about clp merge, uttam kuar reddy about clp merge, uttam fire on clp merge in trslp,

Related Post