గెలుపు కోసం పీసీసీ కెస్టెన్ ప్ర‌త్యేక‌ ప్రణాళికలు ..!

news02 July 8, 2018, 8:54 a.m. political

UTTAM

హైదరాబాద్ : ప‌్ర‌త్యేక ఎన్నిక‌ల వ్యూహాల‌కు తెలంగాణ కాంగ్రెస్ ప‌దును పెంచుతోంది . అధికార టిఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆ పార్టీ ర‌థ‌సార‌థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి  స్పీడ్ పెంచారు . కాంగ్రెస్ నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో హ‌స్తం పార్టీ మెజారిటీ సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని తేల‌డంతో మ‌రింత జోష్ తో ముందుకు క‌దులుతున్నారు పీసీసీ కెప్టెన్ త‌నతో పాటు పార్టీ క్యాడ‌ర్ టూ లీడ‌ర్ అంద‌రినీ జ‌నంలో ఉండేలా కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తున్నారు . నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ .. కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఒక ఎత్తయితే .. పార్టీని బూత్ లెవ‌ల్ స్థాయి నుంచి బ‌లోపేతం చేయ‌డం .. వచ్చే సార్వత్రిక ఎన్నిలకల్లో పోటీ చేయ‌నున్న అభ్య‌ర్థులు గెలుపు కోసం ఎప్ప‌టిక‌ప్పు స్థానిక ప‌రిస్థితుల‌క‌నుగుణంగా వ్యూహాలు మారుస్తూ ముందుకు క‌ద‌లాల‌ని దిశానిర్దేశం చేస్తున్నారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ .

UTTAM

పార్టీలో అంతర్గత కలహాలు తెరపైకి తెచ్చే ప్ర‌య‌త్నం కొంత మంది చేస్తున్న‌ప్ప‌టికీ ..  అలాంటి ప్ర‌య‌త్నాల‌కు చెక్ పెడుతూ .. ఇలాంటివి కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమే అంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ పార్టీ నేత‌ల‌కు .. కార్య‌క‌ర్త‌లల్లో జోఫ్ నింపుతున్నారు పీసీసీ కెప్టన్. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంద‌రు నేత‌ల‌ను ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో లాక్కొంటున్న నేప‌థ్యంలో .. పార్టీకి ద్రోహం చేసి పార్టీ మారేవారి గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవ‌ద్ద‌ని .. పార్టీ నుంచి ప‌నికి రాని చెత్త పోయినంత మాత్రాన హ‌స్తానికివ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని క్యాడ‌ర్ లో మ‌నోధైర్యం నింపుతూనే .. పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీ చేస్తున‌నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి . అదే స‌మ‌యంలో ఇంకా పార్టీ నేత‌లు ఎవ‌రెవ‌రు పార్టీ మారే యోచ‌న‌లో ఉన్నార‌నే అంశంలో ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన ఉత్త‌మ్ వారిని బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాల‌ను సైతం ముమ్మ‌రం చేశారు. ఇందులో భాగంగా ఇటివ‌ల మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఇంటికి వెళ్ళి మంత‌నాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే .

UTTAM

ఇక ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ విజ‌యం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కసరత్తులు మొదలు పెట్టారు. గేటర్ హైదరాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలచుకునేలా ప్రత్యేక వ్యూహానికి ప‌దును పెడుతున్నారాయ‌న . సీమాంద్ర నేతలను గుర్తించి .. సెటిల‌ర్స్ ప్ర‌భావం ఉండే నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి టికెట్స్ ఇచ్చేలా ఇప్ప‌టికే అంత‌ర్గ‌తంగా మంత‌నాలు సాగిస్తున్నారు ఉత్త‌మ్ .గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో సీమాంద్రలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ ప్రాంతానిక చెందిన బ‌ల‌మైన నాయ‌కుల‌తో పీసీసీ ఇప్ప‌టికే ట‌చ్ లో ఉంది.  రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపం బీజేపీ పై సీమాంద్రుల్లో ఉన్న నేప‌థ్యంలో .. ఏపీకీ స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప‌రిణామాలు సీమాంద్రులు .. ప్ర‌త్యేకించి గ్రేట‌ర్ హైద‌ర‌బాద్ లో ఉన్న వారు కాంగ్రెస్ పై సానుకూలంగా ఉన్నార‌ని పీసీసీ భావిస్తోంది 

UTTAM

అదే త‌ర‌హాలో పాత‌బ‌స్తీ పైనా స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి . ఓల్డ్ సిటీలో ఎంఐఎం బలంగా ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థులైన గట్టి అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పావులు క‌దుపుతున్నారు . పాత‌బ‌స్తీలో ఎంఐఎం ను దెబ్బ‌తీయ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతున్నారు ఆయ‌న . పాత‌బ‌స్తీ నుంచి ఇప్ప‌టికే ఎంఐఎం నుంచి బ‌ల‌మైన నేత‌ల‌కు గాలం వేస్తూ పార్టీకి ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ త‌న ప్లాన్స్ ను ప‌క్కాగా అమ‌లు చేస్తోంది . కొంద‌రు బ‌ల‌మైన నేత‌లు ఇప్ప‌టికే కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రికొంద‌రు నేత‌లు త‌మ వైపుకు వ‌చ్చే చాన్స్ ఉంద‌ని హ‌స్తం నేత‌లు చెబుతున్నారు .

UTTAM

tags: Uttamkumar reddy,pcc president,pcc,aicc,rahul gandhi,soniya gandhi,kcr,trs party,trs bhavan,trs meetins,congress meetings,mim,modi,bjp,amithsha,bjp president,telangana,trs govt,uttam kumar reddy bus yathra,kuntiya,janareddy,shabber ali,bhatti vikramarka,sridhar babu,anjan kumar yadav,greater congress,ghmc congress committe,congress raly

Related Post