ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా ఫ‌లితాలు ..!

news02 Jan. 8, 2019, 6:08 p.m. political

mallu ravi

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు  .. మాజీ ఎంపి మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విపరీతంగా డబ్బు పంచిందన్న ఆయ‌న కేసీఆర్ ఇచ్చ‌ల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని  ఆరోపించారు. 

mallu ravi

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యలు సరికాదన్నారు. పార్టీలో అన్ని విధాల ప‌ద‌వులు అనుభ‌వించిన సీనియర్‌ నేతలు పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తించడం .. మాట్లాడ‌టం  మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్‌ విషయం ఏఐసీసీ చూసుకుంటుందని ర‌వి తెలిపారు.

mallu ravi
 

tags: Mallu Ravi Hot Comments On Survey Satyanarayana,Uttamkumar reddy,Mallu ravi,survey satyanarayana,janareddy,bhatti vikramarka,revanthreddy,gandhibhavan,congres meetings,rahulgandhi,kcr,ktr,harishrao,kavitha,tpcc

Related Post