రైళు ప‌ట్టాల‌పై గుజ్జ‌ర్ల వంటా వార్పు..

news02 Feb. 11, 2019, 11:14 p.m. political

gujjars_agitation_on_railway_tracks

రాజ‌స్థాన్ -  రాజ‌స్తాన్ లో గుజ్జ‌ర్లు మ‌ళ్ళీ రెచ్చి పోయారు. విధ్యా ,ఉద్యోగాల్లో ఐదు శాతం రిజ‌ర్వేష‌న్ల సాద‌న కై మ‌రోసారి ఆంధోళ‌న బాట ప‌ట్టారు. గుజ్జ‌ర్లు చేప‌ట్టిన ఆంధోళ‌న ఐదో రోజుకు చేరింది. ఆధివారం జ‌రిగిన ఆంధోళ‌న‌లో నిర‌స‌న కారులు పోలీసుల‌పైకి కాల్పుల‌కు దిగ‌డంతో.. ఉధ్య‌మం పూర్తిగా హింసాత్మ‌కంగా మారి.. ప‌లు పోలీసు వాహ‌నాల‌కు సైతం ఆంధోళ‌న కారులు నిప్పు పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. దీంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. గ‌తంలో గుజ్జ‌ర్ల ఆంధోళ‌న‌లు.. గ‌త ఐతు  రోజులుగా  కొన‌సాగ‌తున్నాంధోళ‌న నేప‌థ్యంలో ఉధ్య‌మాకారుణ‌లు శాంతింప‌చేసేందుకు ఒక వైపు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. మ‌రోవైపు ఆంధోళ‌న‌కారులు ఏమాత్రం  వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డం.. రాష్ట్రంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. ఆంధోళ‌న కారులు.. రైలు ప‌ట్టాల‌పైనే వంటా వార్పు చేప‌ట్ట‌డంతో.. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది సర్కార్.  దీనిలో భాగంగా..మంగ‌ళ‌వారం నుండి..21 రైళ్ళ‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం.. 8 రైళ్ళ‌ను దారి మ‌ళ్ళించింది. మ‌ళ్ళీ ఈ గుజ్జ‌ర్ల ఆంధోళ‌న ఎక్క‌డ తీవ్ర‌రూపం దాల్చుతుందో అన్న ఆంధోళ‌న‌తో ఉన్న‌ప్ర‌భుత్వం.. మ‌రోవైపు గుజ్జ‌ర్ల ఉధ్య‌మ నాయ‌కుల‌తో చ‌ర్చ‌ల‌కు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఫ‌లితం మాత్రం రావ‌డంలేదు. 


 

tags: gujjars agitation, rajasthan, gujjars reservestion fight, ralway tracks, proyests, ralle cancell, governament, gujjars attack police, agitators fire on police

Related Post