సీఎల్పీ విలీనం ఉత్తర్వులను రద్దు చేయండి

news02 June 10, 2019, 3:53 p.m. political

congress

కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ మేరకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్పీకర్‌  జారీ చేసిన సీఎల్పీ విలీనం ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేతలు పిటీషన్ లో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను.. టీఆర్ ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేస్తూ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి నాలుగు రోజు క్రితం నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. కాంగ్రెస్‌ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎల్పీ తీర్మానం లేకుండా 12 మంది ఎమ్మెల్యేలు విలీనాన్ని కోరడం.. స్పీకర్‌  దాన్ని యధావిధిగా ఆమోదించడం చట్టబద్ధంగా లేదని హైకోర్టులో దాఖలు చేసిన పీటీషన్ లో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని కొట్టివేయాలని వారు కోర్టుకు విన్నవించారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతల పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. దీనిపై రేపు విచారణ జరపనుంది.

tags: congress file pitition, congress file pitition against clp merge, congress pitition in high court against clp merge, uttam file pitition against clp merge in high court, congress file pitition against clp merge in high court

Related Post