ఎంపీగా నాలుగోసారి ప్రయాణం..

news02 June 17, 2019, 8:25 p.m. political

rahul

 

అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజున లోక్ సభ సమావేశాల్లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగింది. ప్రధాని మోదీ సహా, మంత్రులు, ఎంపీలంతా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ రాహూల్ గాంధీచేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటి రోజు రాహుల్ గాంధీ సభకు రాకపోవడంతో వచ్చిన పలు సందేహాలకు ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. లోక్‌సభ సభ్యుడిగా నాలుగోసారి నా ప్రయాణం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందన్న రాహూల్.. ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కేరళలోని వయనాడ్ ఎంపీగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని చెప్పారు. రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, విధేయతతో ఉన్నానని రాహూల్ గాంధీ ట్విట్టర్ వేధికగా సమాధానం ఇచ్చారు. 
 

tags: rahul, rahul gandhi, rahul oath taking, rahul gandhi oath taking, rahul take oath, rahul gandhi take oath

Related Post