ప్రగతి నివేధన సభ కోసం నెల రోజుల మధ్యం..

news02 Sept. 13, 2018, 6:06 p.m. political

vh

కెసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతా రావు. తెలంగాణలో ఆగష్టు 2నుంచి 30వరకు 304కోట్ల మధ్యం అమ్మకాలు జరిగితే.. ప్రగతి నివేధన సభ జరిగిన మూడు రోజుల్లో 294కోట్ల మధ్యం అమ్మకాలు జరిగాయని ఆయన చెప్పారు. అంటే కేవలం ప్రగతి నివేధన సభ కోసం నెల రోజుల మధ్యాన్ని మూడు రోజుల్లో తాగారని వీహెచ్ విమర్శించారు. ప్రగతి నివేధన సభకోసం కేవలం మధ్యానికే 294 కోట్లు ఖర్చు చేస్తే ఇక సభ నిర్వహనకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో అర్ధం చేసుకోవచ్చని ఆయన అన్నారు. 

vh

తెంలగాణ ఎంతో అభివృద్ది చెందిందని చెబుతున్న కేసీఆర్ మధ్యం అమ్మకాల్లోనే ఆ అభివృద్ది కనిపిస్తుందని వీహెచ్ ఎద్దేవా చేశారు. ఇక కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించడానికి కూడా కేసీఆర్ కు సమయం లేదా అని వీహెచ్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఫార్మ్ హౌజ్ లో ఉంటూ కాంగ్రెస్ నేతలను అక్రమ కేసుల్లో ఎలా ఇరికించాలో ఆలోచిస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు.
 

 

tags: vh, vh fire on kcr, vh fire on trs, v hanumantha rao fire on kcr, vh on kondagattu accident, vh fire on trs govt

Related Post