మోడీ చేతిలో కేసీఆర్ .. జ‌గ‌న్ లు పావులు ..!

news02 March 6, 2019, 10:16 p.m. political

JAGAN WITH KTR

అమరావ‌తి : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆడిస్తున్న ఆట‌లో జ‌గ‌న్ .. కేసీఆర్ లు పావులుగా మారార‌ని తెలుగుదేశం విమ‌ర్శించింది. దొంగ ఓట్లు - దొంగ నోట్ల బ్యాచ్‌ ఒక చోటుకు చేరినట్టు జగన్‌ - కేటీఆర్‌ మధ్య దోస్తీ ఉందని ఆ పార్టీ దుయ్యబట్టింది. వికృత రాజకీయాలతో వ్యవస్థలకే కళంకం తెచ్చేలా వైసీపీ .. టీఆర్ఎస్ వైఖరి ఉందని ఆ పార్టీ నేత‌లు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకు వైసీపీ కుట్రలు .. కుయుక్తులు పన్నుతూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు.

JAGAN WITH KCR

ఆన్‌లైన్ లో ఉన్న ఓటరు జాబితాను ఎవరైనా వాడుకోవచ్చని ఎన్నికల సంఘమే చెప్పిందని గుర్తుచేసిన ట‌టీడీపీ నాయ‌కులు .. తెలుగు దేశం కార్యకర్తల డేటాను జగన్ కు ఇవ్వడమేనా కేసీఆర్ చంద్ర‌బాబు కు ఇస్తానన్న రిటర్న్‌ గిఫ్ట్‌ అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి జగన్‌ సామంతరాజుగా మారారని విమర్శించారు. ఏపీపై కత్తి కట్టిన కేసీఆర్ ..మోడీతో జగన్‌ కలవడం రాష్ట్ర ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితానే పార్టీలన్నీ వాడుకుంటున్నాయని .. ఆ డేటాను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ వాడుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

JAGAN WITH KCR

tags: TDP FIRE ON YS JAGAN MOHAN REDDY,AP TDP,YSRCP,YS JAGAN MOHAN REDDY,KTR,CHANDRA BABU,NARA LOKESH,TRS,TELANGANA,TPCC,UTTAM KUMAR REDDY,MODI,AMITH SHA,BJP,POWAN KALYAN,JANA SENA

Related Post