సర్వేల ఆధారంగానే టిక్కెట్లు..

news02 Oct. 7, 2018, 7:54 a.m. political

pcc

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగం పెంచింది. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కెటాయించాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈమేరకు హైదబాదాద్ లోని ఓ రిసార్ట్ లో పీసిసి ఎన్నికల కమిటీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ బేటీలో పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కుంతియా, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

pcc

ఎన్నికల షెడ్యూలో.. అభ్యర్ధుల ఎంపికపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్ధులను ఎంపిక చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్ధులపై సర్వేలు నిర్వహించి.. ఆ ఫలితాలను బట్టే టిక్కెట్లు కెటాయించాలని డిసైడ్ చేశారు. మాహా కూటమిలో టిక్కెట్ల పంపకాలపై క్లారిటీ రాగానే పార్టీ టిక్కెట్లపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. కేవలం పనితీరు, సర్వే ఫళితాల ఆధారంగానే పార్టీ టిక్కెట్లు కెటాయించాలని పీసిసి ఎన్నికల కమిటీలో నిర్ణయించారు. 

pcc

ఇక గతంలో మూడు సార్లు పోటీ చేసి ఓడుపోయిన వారికి ఈ సారి టిక్కెట్లు కెటాయించరాదన్న సూచన సమావేశంలో కొంత మంది నేతలు చేశారు. అంతేకాదు గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన వారికి సైతం ఈ ఎన్నికల్లో టీక్కెట్ ఇవ్వకూడదన్న ప్రతిపాదనా కమిటీ ముందుకు వచ్చింది. ప్రధానంగా టిక్కెట్ల కెటాయింపులో సామాజిక న్యాయం పాటించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. మరోసారి సమావేశమై సర్వే ఫళితాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపికపై చర్చించి తుది జాబితాను స్క్రీనింగ్ కమిటీకి నివేదించాలని పీసిసి ఎన్నికల కమిటీ నిర్ణయించింది.

tags: pcc, pcc chief uttam, pcc election committe, pcc chief uttam kumar reddy, uttam in pcc election committe, uttam kumar reddy in election committe, uttam on candidates selection

Related Post