ఓటింగ్ నుంచి తప్పుకొని మోడీకి మేలు చేసిన టిఆర్ఎస్

news02 July 21, 2018, 12:19 p.m. political

Cm kcr met pm modi

ఢిల్లీ ః మొత్తానికి బీజేపీతో ర‌హ‌స్య స్నేహం చేస్తున్న టీఆర్ ఎస్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌ల‌య్యే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అది కూడా పార్ల‌మెంట్ సాక్షిగా.. ఇన్ని రోజులూ బీజేపీపై సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది టీఆర్ ఎస్‌. అదేమ‌ని అడిగిన ప్ర‌తిప‌క్షాల ప్ర‌శ్న‌ల‌ను తిప్పికొడుతూ.. కేంద్రంతో స్నేహంగా ఉండంటం త‌ప్పా అని స‌మాధానం ఇస్తూ వ‌స్తున్నారు. అయితే పార్ల‌మెంట్ లో టీడీపీ అవిశ్వాస తీర్మానం సాక్షిగా టీఆర్ ఎస్ ఇరుక్కుపోయింది.

Cm kcr met modi

రాష్ట్రవిభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌పై కేంద్రంతో యుద్దం చేస్తాం...అన్నింటికి సాధిస్తాం అని గ‌త నాలుగేళ్ళుగా టీఆర్ ఎస్ నేతలు చెబుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్టం లోని హామీలేవి సాధించ‌లేదు. దీన్ని రాష్ట్ర టీఆర్ ఎస్ నేత‌లు కూడా అంగీక‌రిస్తున్నారు.. అయితే బీజేపీని నిల‌దీసి రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టే స‌మ‌యం వ‌చ్చే స‌రికి టీఆర్ ఎస్ చేతులెత్తేసిందేన‌నే భావ‌న క‌లుగుతోంది. బీజేపీతో ఇన్ని రోజులు చేసిన ర‌హ‌స్య దోస్తానా.. పార్ల‌మెంట్ సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లయ్యింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Trs BJP falgs

రాష్ట్రవిభజ‌న హామీల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సిన టీఆర్ ఎస్ నేతలు.. వారికివ‌చ్చిన స‌మ‌యాన్నంతా కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకే వాడుకున్నారు. హామీల‌ను కూడా ప్ర‌స్తావించినా విజ్ణ‌ప్తుల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప డిమాండ్ లేమి చేయ‌లేదు. ఇక ప్ర‌థాని మోడీ కూడా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తారు. పైగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ధికి ఏపీ సీఎం అడ్డుత‌గులున్నారంటూ.. ఇన్నాళ్ళు టీఆర్ ఎస్ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల‌నే వ‌ల్ల‌వేశారు. 

Cm kcr with BJP leaders

తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమ‌లుచేయ‌టం లేద‌ని చెబుతున్నటీఆర్ ఎస్ నేత‌లు... ఓటింగ్ స‌మ‌యంలో అవిశ్వాసానికి మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం వ‌చ్చే సరికి .. చేతులెత్తాశారు. బీజేపీ కి వ్య‌తిరేక ఓటు వేయొద్ద‌ని డిసైడ్ అయిన టీఆర్ ఎస్ నేత‌లు.. త‌ట‌స్థ‌మ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే.. కేంద్రంపై ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉండేది. దీంతో ఇన్ని రోజులు బీజేపీ-టీఆర్ ఎస్ కి మ‌ధ్య ఏదో ఒప్పందం ఉంద‌ని ఆరోపిస్తున్న ప్ర‌తి ప‌క్షాల అనుమానం నిజ‌మైంద‌నే వాద‌న వినిపిస్తోంది. 5 టీఆర్ ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసిన‌ట్లేన‌ని కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ ఇప్పుడు నిజ‌మైంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్‌.. మోడీ ఒక్క‌టేన‌ని దీంతో రుజువంద‌ని.. ఇప్పుడు కేసీఆర్ .. తెలంగాన ప్ర‌జ‌ల‌కు ఏమి స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.

tags: Narendra Modi, pm modi, parliament no-confidence motion, cm kcr friends, cm kcr secret news, cm kcr pm modi friends, cm kcr family, pm modi family, modi full name, parliament sessions, dathatreya family.

Related Post