సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటులో పీకే
మళ్లీ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్
ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) మళ్లీ రాజకీయాల్లోకి ఎంటరవుతున్నారు. భారత్ లో ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడిగా పేరుగాంచిన పీకే త్వరలోనే పొలిటికల్ పార్టీ ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం చేపడుతోన్న జన్ సురాజ్ యాత్రను రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు తెలిపారు ప్రశాంత్ కిషోర్. గాంధీ జయంతి అక్టోబరు 2న రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
వచ్చే సంవత్సరం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ తరఫున పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీహార్ లోని పట్నాలో ఏర్పాటు చేసిన ‘జన్‌సురాజ్’ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ ఈ విషయం చెప్పారు. పార్టీ ఏర్పాటు, నాయకత్వం వంటి వివరాలు త్వరలోనే చెబుతానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్ మనవరాలు జాగృతి ఠాకుర్ తదితరులు హాజరయ్యారు.