రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది..
మాస్ మహారాజ హీరో రవితేజ తాజా సినిమా మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). టీజర్ విడుదలైంది. రవితేజ (Ravi Teja), దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన షాక్, మిరపకాయ్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ లో భాగంగా సినిమా బృందం టీజర్ ను (Mr Bachchan Teaser) ఆదివారం విడుదల చేసింది. ఎప్పటిలాగే రవితేజ యాక్షన్, ఎనర్జీ అభిమానులను ఆకట్టుకుంటోంది.